ప్రస్తుత సమాజంలో సమస్యలు లేని వారు అస్సలు ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే ప్రస్తుత సమాజంలోని పరిస్థితులు అలా ఉన్నాయి.
ఈ సమాజంలో జీవిస్తున్న ప్రజలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.రకరకాల సమస్యలతో చాలామంది ప్రజలు ప్రతిరోజూ ఇబ్బంది పడుతున్నారు.
అయితే ప్రతి కుటుంబంలో ఇతరులచేత, బంధుల చేత, ఆరోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులను చాలామంది ఎదుర్కొంటూనే ఉన్నారు.అలాంటప్పుడు ఇంట్లో ఎప్పుడూ సమస్యలు ఉంటాయి.
అయితే కుటుంబంలో ఐక్యత లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు( Financial Problems ) తరచుగా వేధిస్తూ ఉంటే, అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటే, శత్రుబాధ తొలగిపోవాలంటే సులభమైన పరిహారం మార్గం ఒకటి ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు సాయంత్రం పూట వేపాకు పై రెండు మట్టి ప్రమిదలను( Mud Lamp ) ఉంచి దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా పసుపు కుంకుమలతో అలంకరించబడిన తర్వాత రంగవల్లికలు తీర్చిదిద్ది దానిపై వేపాకు ఉంచి దీపం వెలిగించాలి.ఈ దీపానికి నువ్వుల నూనె, పసుపు రంగు వత్తులను ఉపయోగించడం మంచిది.
ఇలా చేయడం వలన జీవితంలో ఉన్న బాధలు అన్ని తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే శత్రుభయం కూడా తొలగిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది.ఈ దీపాన్ని ( Diya ) తూర్పు లేదా పడమర వైపు ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు.మరి ఆలస్యం ఎందుకు ఈ దీపల పరిహారాన్ని ప్రతిరోజు సాయంత్రం చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అయిపోతాయి.కాబట్టి జీవితం లో అనేక రకాల సమస్యలను ఎదుర్కుంటున్న వారు ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఈ విధంగా మీ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.
LATEST NEWS - TELUGU