స్కిల్ స్కాం( Skill Scam Case ) కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిందని, ఆయనకు స్కిన్ ఎలర్జీ వచ్చిందని ప్రభుత్వం ఆయన పట్ల అమానవియంగా వ్యవహరిస్తుందంటూ తెలుగుదేశం నేతలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రపక్షం జనసేన కూడా వ్యాఖ్యానిస్తుంది వెరసి తెలుగుదేశం అనుకూల మీడియాలో ఈ వయసులో చంద్రబాబు ని ఇబ్బంది పెట్టడానికి అధికార వైసీపీ ప్రయత్నిస్తుందన్న వార్తలు కొంత అదికార వైసీపీని డిఫెన్స్ లో పడేస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి.ముఖ్యంగా ప్రతి శనివారం ఏదో ఒక కార్యక్రమం పేరుతో టిడిపి చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest )ను తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారుస్తుంది.
బలమైన సామాజిక వర్గం ఆర్థిక అండదండలు ఉండటం తో పాటు బలమైన మీడియా మద్దతు ఉండటంతో ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు లైవ్ లైన్ లో ఉంచడంలో ఈ వర్గాలు సఫలీకృతం అవుతున్నట్లే తెలుస్తున్నాయి ముఖ్యంగా చంద్రబాబు జైల్లో ఉండటం ఆయనకు సంబంధించిన ప్రత్యక్ష వివరాలేమి ప్రజలకు తెలియకపోవడంతో ఒక పథకం ప్రకారం చంద్రబాబుకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని హైలెట్ చేస్తున్న మీడియా తెలుగు ప్రజల మనసుల్లో ఒక అభిప్రాయాన్ని బలంగా ముద్రించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.దాంతో చంద్రబాబుకు ఏమీ అవలేదని చంద్రబాబు విషయంలో ప్రభుత్వం అన్ని నియమాలను పాటిస్తుందని ఒకటికి పది సార్లు చెప్పవలసిన పరిస్థితుల్లో అధికార పార్టీ నిలబడింది.
ఒకరకంగా టిడిపి సెంటిమెంట్ అస్త్రం వైసిపికి కొంత ఇబ్బందికర వాతావరణ క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.బాబు రిమాండ్ మరో రెండు మూడు నెలలు పాటు కొనసాగితే మాత్రం ఇది కచ్చితంగా ఎన్నికల అంశం గా మారే అవకాశం ఉందని సానుభూతి అన్నది క్రియాశీలకంగా పనిచేస్తుంది అని గతం లో చాలాసార్లు నిరూపించబడినందున ఈసారి కచ్చితంగా అది తెలుగుదేశానికి అనుకూలంగా మారుతుందని, జనసేన పొత్తు( Jana sena ) తో పాటు సెంటిమెంట్ అస్త్రం కూడా కలిసొస్తే తిరుగులేని విజయాన్ని తెలుగుదేశం నమోదు చేసే అవకాశం ఉందని కూడా మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.