వైసీపీలో రోజా పనైపోయిందా ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చెప్పే ఒక సమాధానం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అని.ప్రత్యర్థి పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేయడంలోనూ, ఆరోపణలు చేయడంలోనూ రోజా స్టైలే వేరు.

 Is Roja Wasted In Ycp,ap Poltics,ys Jagan,nagari Mla Roja-TeluguStop.com

ఆమె చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదం అవుతూనే ఉంటాయి.నగరి నియోజిక వర్గం నుంచి 2014 మరియు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.

పార్టీలో కీలక మహిళా నేతగా స్థానం సంపాధించుకున్నారు.అయితే రోజా వైఖరి, ఆమె చేసే వ్యాఖ్యలు ఆయా సందర్భల్లో సొంత పార్టీని కూడా చిక్కుల్లోకి నేడుతుంటాయి.

ఫలితంగా ప్రజల్లో ఆమెనే నవ్వులపాలు కావడమే కాకుండా పార్టీని కూడా నవ్వులపాలు చేస్తుంది.ఇదిలా ఉంచితే ప్రస్తుతం వైసీపీలో రోజా పాత్ర తగ్గుతోందా ? జగన్ ఆమెను పక్కన పెట్టె దిశగా అడుగులు వేస్తున్నారా ? అంటే అవునేమో అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.2019 ఎన్నికల తరువాత మొదటి మంత్రి వర్గవిస్తరణలో రోజా కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని భావించారంతా.కానీ అలా జరగలేదు.

రెండో మంత్రి వర్గంలో స్థానం దక్కినప్పటికి పెద్దగా ప్రదాన్యం లేని పదవినే ఆమెకు కట్టబెట్టారు జగన్.దీంతో వైసీపీ ఆమెను మెల్లగా సైడ్ చేస్తున్నారా అనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో రోజా కు టికెట్ ఇవ్వడం కూడా కష్టమే అనే వాదన వినిపిస్తోంది.

Telugu Ap Rk Roja, Ap, Ap Poltics, Roja Ycp, Nagari Mla Roja, Ys Jagan-Politics

నియోజిక వర్గంలో అందిన సర్వేల ప్రకారం రోజాకు ఆధారణ తగ్గిందని జగన్ దృష్టికి వచ్చిందట.దాంతో ఈసారి రోజా స్థానంలో కొత్త వారిని బరిలోకి దించాలనే ప్లాన్ లో జగన్ ఉన్నారట.గత కొన్నాళ్లుగా నగరిలో రోజా మరియు మున్సిపల్ మాజీ చైర్మెన్ కేజే కుమార్ కు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంతలా వివాదం కొనసాగుతోంది.

ఇద్దరు వైసీపీకి చెందిన వారే కావడంతో ఈ వివాదాల కారణంగా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని జగన్ ఓ అంచనాకు వచ్చినట్లు టాక్.అందుకే ఈసారి నగరి టికెట్ రోజా కు కష్టమే అనే వాదన పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుతోంది.

ఒకవేళ అదే గనుక నిజం అయితే వైసీపీలో రోజా పనైపోయినట్లే అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube