భోళా ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఈసారైనా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్”.ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుంది.

 Release Date Locked For Bholaa Shankar Trailer, Bhola Shankar Trailer, Bhola Sha-TeluguStop.com

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బోణీ కొట్టిన చిరు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే షూట్ పూర్తి చేసారు.తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Telugu Bhola Shankar, Bholashankar, Keerthy Suresh, Chiranjeevi, Meher Ramesh, L

మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.ఇక ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోగా తాజాగా భోళా శంకర్ ట్రైలర్ గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ఎదురు చూస్తుండగా మెహర్ రమేష్ ట్రైలర్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

భోళా ట్రైలర్ డేట్ లాక్ చేసినట్టు తెలిపారు.ఈ సినిమా ట్రైలర్ జులై 27న లాంచ్ చేయనున్నట్టు మెహర్ చెప్పుకొచ్చాడు.దీంతో ఈ ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.మరి ఈ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచేసి రిలీజ్ సమయానికి హైప్ ఇంకాస్త పెరిగితే ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయం.

వరుసగా రెండు హిట్స్ అందుకున్న చిరు భోళా శంకర్ కూడా హిట్ అందుకుని హ్యాట్రిక్స్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube