KCR BRS Party: ప్రత్యామ్నాయ రాజకీయాలు బిఆర్ఎస్‎తో సాధ్యమా?

75 సం స్వాతంత్య్ర భారత్ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో భారతదేశ రాజకీయాల్లో అస్పష్టత”రాజ్యమేలుతుంది.దేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు మరియు లోక సభకు ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలకు ‘కేంద్ర పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు విభిన్నమైన తీర్పు ఇచ్చారు .

 Is Alternative Politics Possible With Kcr Brs Party Details, Alternative Politic-TeluguStop.com

రాష్ట్ర అసెంబ్లీలకు ప్రాంతీయ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ఓటర్లు తమ ఓటు ద్వారా మద్దతు ఇచ్చారు.ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ దంద్వ వైఖరితో సమాఖ్య రాజ్యవ్యవస్తకు మోగ్గు చూపారు.

దేశంలో నరేంద్ర మోడీ దేశ ప్రధాన మంత్రిగా జాతీయ సమస్యల పరిష్కారం లో ముందుకు పోవడమే కాకుండ దేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని సమకూర్చి అగ్రదేశాలను శాసించే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లడం ఇటీవల జి20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు దేశ ప్రధాని హోదాలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు.మోడీ దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలు అవసరాలు ధీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అవలంబిస్తున్న వ్యూహాలు ఎవరు ఊహించి ఉండరు.

మోడీ బలమైన దృథమైన నాయకత్వాన్ని దేశానికి అందించాడు.

కరోనా మహమ్మారి విసిరిన పంజా నుండి దేశ ప్రజలను కాపాడటమే గాకుండా ప్రపంచ దేశాలకు వాక్స్సిన్ సప్లై చేసి మానవతను చాటాడు ప్రపంచ మానవాళికి ఆరోగ్యం పట్లబరోసా కలిగించాడు.

మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశములో సామాజిక పునర్నిర్మాణానికి కోత్తరూపం వచ్చింది.హిందుత్వ ఎజెండా కొనసాగిస్తూనే సామాజిక ప్రాతిపదికన సబ్ కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరున పాలన సాగుతుంది.370 ఆర్టికల్ రద్దు అయోద్యా.ట్రిపుల్ తాలఖ్ వంటి గట్టి నిర్ణయాలు శాంతి పరిరక్షణ ‘దేశ రక్షణ కోసం అవలంబిస్తున్న పటిష్ట వ్యూహం.

బిజెపి పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంచాయి.దేశంలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Telugu Alternative, Brs, Cm Kcr, India, Kcr Brs, Kcr National, Narendra Modi, St

తెలంగాణలో ప్రతేక రాష్ట్ర సెంటిమెంట్ మీద అధికారానికి వచ్చిన కెసిఆర్ ఏపిలో వై‌ఎస్ జగన్మోహన్ రెడ్డి, తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమత బెనర్జీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి బలమైన ప్రాంతీయ పార్టీల నేతలుగా నిలిచిపోయారు.తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పేరుతో జాతీయరాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించాడు.జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులే లక్ష్యంగా ప్రారంభించిన బి ఆర్ఎస్ దేశంలో వివిధ రాష్ట్రాలలో నెలకొన్న విభిన్న స్థానిక పరిస్థితులు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులకు అనూకూలంగ పార్టీ వ్యవస్థాపక నిర్వహణ కార్యక్రమాల విస్తరణ పార్టీ రాజకీసైద్ధాంతిక ప్రచారం ఆయా రాష్ట్రాలలో జనామోధమున్న విశ్వసనీయులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడంలో ప్రతేక శ్రద్ధ పెట్టాలి.బిఆర్ఎస్ ఉద్దేశాలు లక్ష్యాలు దేశ ప్రజల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యాలి.

Telugu Alternative, Brs, Cm Kcr, India, Kcr Brs, Kcr National, Narendra Modi, St

తెలంగాణ లో అమలు అవుతున్న పలు అభివృధి సంక్షేమ విద్య ‘వైద్య :ఆరోగ్య విధానాల పట్ల విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యాలి.గత75 యేళ్ల లో దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు పార్టీలు రాజ్యాంగ లక్ష్య్యాలు సామాన్యుని సాధికారిత సాధనాలో అవలంభించిన విధానాల పట్ల ఓటర్లకు అవగాహన కలిగించాలి.ఓటర్లలో ప్రత్యాయన్మాయ రాజకీయాల పట్ల అవగాహన చైతన్యం కలిగించాలి.దేశంలో పరిస్థితులకు అనుకూలంగా రాజకీయులు మారుతున్నాయి.ప్రజలు కూడా ఓకే పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు ఓటుబ్యాంకు అన్నది అభూత కల్పనైంది.నోటుకు ఓటు సంస్కృతి రాజ్యమేలుతుంది డబ్బుల కొరకు ఓటర్లు ధర్నా చేసే.

స్థాయికి రాజకీయాలు దిగజారినాయి.ప్రజాస్వామ్యం ధన స్వామ్యం మైంది ఎన్నికలప్పుడురాజకీయ నాయకులు సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి తమ వ్యాపార అధికార ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు మారినట్లు ఓటర్లు ఎక్కువ డబ్బులు ఇచ్చిన పార్టీకి అభ్యర్థికి ఓటు వేసే పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube