ఖమ్మంలోని పది నియోజకవర్గాలకు సాగునీరు..: కేసీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Irrigation To Ten Constituencies In Khammam..: Kcr-TeluguStop.com

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజల్లో పరిణితి రాలేదని కేసీఆర్ అన్నారు.ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని తెలిపారు.

ఎన్నికల్లో ప్రజలు గెలిచినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు.కొందరి మోసపూరిత హామీలను నమ్మొద్దన్న కేసీఆర్ కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని చెప్పారు.

గతంలో తాగు, సాగునీటి కష్టాలు, కరెంట్ కోతలతో పాటు వలసలు ఉండేవన్నారు.అయితే బీఆర్ఎస్ వచ్చాక పద్ధతిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ వస్తోందని పేర్కొన్నారు.సీతారామ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయన్న కేసీఆర్ ఏడాదిలోపు ఖమ్మంలోని పది నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube