భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ( PM Narendra Modi ) రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ లాన్స్ లో రేపు రాత్రి 7.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో ఢిల్లీలో( Delhi ) హై అలర్ట్ జారీ అయింది.
ఈ క్రమంలోనే సెంట్రల్ ఢిల్లీని రేపు, ఎల్లుండి నో ఫ్లై జోన్ గా( No Fly Zone ) ప్రకటించారు.అదేవిధంగా లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్, ఒబెరాయ్ హోటళ్ల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి భవన్ వద్ద సుమారు 2,500 మంది పోలీసులు సహా పారామిలటరీ బలగాలు మోహరించాయి.
కాగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సుమారు పది వేల మంది హాజరుకానున్నారు.
పలు దేశాలకు చెందిన నేతలతో పాటు జాతీయ నేతలు, గవర్నర్లు, సీఎంలు, మాజీ గవర్నర్లు, ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వందే భారత్ లోకో ఫైలెట్లు, పారిశుద్ధ్య కార్మికులు, సెంట్రల్ విస్టా కార్మికులు పాల్గొననున్నారు.