కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక తీర్మానం

ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( Congress Working Committee ) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని( Rahul Gandhi ) నియమించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.

 Key Resolution In Congress Working Committee Meeting Details, Congress Working C-TeluguStop.com

కాగా ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీ సమీక్షించిన సంగతి తెలిసిందే.సీడబ్ల్యూసీ భేటీ ముగిసిన అనంతరం ఆ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్( KC Venu Gopal ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పని అయిపోయిందని చాలా మంది అన్నారన్న ఆయన రాహుల్ గాంధీ చేసిన రెండు యాత్రలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయని చెప్పారు.

సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కాంగ్రెస్ ముందుంటుందని తెలిపారు.సీబీఐ, ఈడీ సంస్థలతో కాంగ్రెస్ నేతలకు బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు.అదేవిధంగా మోదీ అన్నీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube