కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక తీర్మానం
TeluguStop.com
ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( Congress Working Committee ) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని( Rahul Gandhi ) నియమించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.
కాగా ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీ సమీక్షించిన సంగతి తెలిసిందే.
సీడబ్ల్యూసీ భేటీ ముగిసిన అనంతరం ఆ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్( KC Venu Gopal ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ పని అయిపోయిందని చాలా మంది అన్నారన్న ఆయన రాహుల్ గాంధీ చేసిన రెండు యాత్రలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయని చెప్పారు.
సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కాంగ్రెస్ ముందుంటుందని తెలిపారు.సీబీఐ, ఈడీ సంస్థలతో కాంగ్రెస్ నేతలకు బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా మోదీ అన్నీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
కళ్యాణ్ రామ్ ను ట్రోల్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే?