పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గెలుపు గురించి పాజిటివ్ గా స్పందించారు.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన రెండో పెళ్లి( Second Marriage ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయిన తర్వాత ఈమె తరచు తన రెండో పెళ్లి గురించి వార్తలలో నిలుస్తున్నారు.
గతంలో ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్న ఈమె అనంతరం తన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.కానీ రెండో పెళ్లి అయితే తప్పకుండా చేసుకుంటానని పలు సందర్భాలలో చెప్పిన రేణు దేశాయ్ ఇప్పుడు మాత్రం రెండో పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయాలను కూడా వెల్లడించారు.మరో రెండు మూడు సంవత్సరాలలో తన రెండో పెళ్లి జరుగుతుందని ఈమె తెలిపారు.విడాకులు తీసుకున్న తర్వాత నేను రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ అప్పుడు నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు.
పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త సమయం నా భర్తకు కేటాయించాల్సి ఉంటుంది అలాంటి సమయంలో పిల్లల బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేను ఆ ఒక్క కారణంతోనే పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా ఆగిపోయానని ఈమె తెలిపారు.ఇక ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వారికంటూ ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది.అందుకే నేను కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యానని తెలిపారు.ఇక నా రెండో పెళ్లికి నా పిల్లలు కూడా వ్యతిరేకం కాదని రేణు దేశాయ్ వెల్లడించారు.
నాకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే నిన్ను బాగా చూసుకునే వారిని రెండో పెళ్లి చేసుకో అంటూ నాకు సలహాలు కూడా ఇస్తారని ఈ సందర్భంగా రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.