సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన మరోవైపు రాజకీయాలలో( Politics ) కూడా దూకుడు కనబరుస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ( Telugudesam Party ) తరపున గత రెండుసార్లు ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
గత రెండుసార్లు ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన ఈయన ఈసారి కూడా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఇక బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ హిందూపురంలో( Hindupuram ) ఎక్కువగా ఉండకపోయినా ఆయన తరపున ఒక మేనేజర్ ని పెట్టి అక్కడ ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారి అవసరాలను తీరుస్తూ ప్రజలందరికీ చేరువయ్యారు.ఇలా బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈ ఎన్నికలలో కూడా బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలవడంతో అక్కడ ప్రజలు పండగ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే భారీ స్థాయిలో పొట్టేళ్లను నరికి పండగ చేసుకుంటున్నారు.అంతేకాకుండా బాలయ్య ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీకి పూలమాలలు కాకుండా పొట్టేలు తలలతో మాల తయారుచేసి ఫ్లెక్సీకి వేసి సంబరాలు జరుపుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు ఈ వీడియోలపై మీ ఆనందం కోసం ఇలాంటి హింసాత్మక చర్యలు తగవు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు బాలయ్య క్రేజ్ హిందూపురంలో మామూలుగా లేదని ఈ వీడియోలను మరింత వైరల్ చేస్తున్నారు.