రెండుసార్లు ఫెయిల్.. నాన్న కోసం చివరికి ఐపీఎస్.. ఈ యువకుని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పిల్లలు ఉన్నత స్థానాలలో స్థిరపడాలని తల్లీదండ్రులు కోరుకుంటారు.ఎంతో కష్టపడి పిల్లలను చదివించే తల్లీదండ్రులు ఎంతోమంది ఉన్నారు.

 Ips Officer Nachiket Shelke Inspirational Success Story Details, Ips Officer Nac-TeluguStop.com

అలా ఒక తండ్రి తన కొడుకును ఐపీఎస్( IPS ) చేయాలని భావించగా నిచికేత్ షకేలే( Nachiket Shelke ) తన కష్టంతో ఐపీఎస్ అయ్యారు.ప్రస్తుతం నిచికేత్ షలేకే గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తున్నారు.

మహారాష్ట్ర రాష్ట్రంలోని ప్రింళై నిచికేత్ స్వగ్రామం కాగా నిచికేత్ తల్లీదండ్రులు టీచర్స్ గా పని చేస్తున్నారు.

సంతానంలో నేను పెద్దవాడినని తమ్ముడు సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడని నిచికేత్ వెల్లడించారు.

తమ్ముడు సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు.నా చదువు అంతా పట్టణంలోనే పూర్తైందని మా గ్రామం నుంచి పట్టణానికి వెళ్లి చదువుకునేవాడినని నిచికేత్ అన్నారు.

ఐపీఎస్ సాధించాలని ఎంతో కష్టపడ్డానని ఆయన తెలిపారు.రెండుసార్లు సివిల్స్( Civils ) కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యానని చెప్పుకొచ్చారు.

Telugu Civils Ranker, Gunturasp, Ipsnachiket, Ips Journey, Upsc-Inspirational St

అయినా పట్టుదల విడవకుండా ఐపీఎస్ సాధించాలని కష్టపడి చివరకు లక్ష్యాన్ని సాధించానని ఆయన తెలిపారు.ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత కొంతకాలం పాటు అకాడమీ, ఒడిశాలో శిక్షణ పొందనని విధులు, బాధ్యతల గురించి తెలుసుకున్నానని నిచికేత్ వెల్లడించారు.గుంటూరులో( Guntur ) తొలి పోస్టింగ్ రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.గుంటూరు ఈస్ట్ ఏఎస్పీగా( Guntur East ASP ) బాధ్యతలు చేపట్టానని వెల్లడించారు.

Telugu Civils Ranker, Gunturasp, Ipsnachiket, Ips Journey, Upsc-Inspirational St

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని నేరాల నియంత్రణకు కృషి చేస్తామని ఆయన అన్నారు.అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని చోరీల నియంత్రణకు చర్యలు చేపడతామని నిచికేత్ పేర్కొన్నారు.ప్రజలు నన్ను నేరుగా కలవవచ్చని కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నిచికేత్ చెప్పుకొచ్చారు.నిచికేత్ షకేలే సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube