ప్రస్తుత కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలంటే ఎన్నో అద్భుతమైన స్కిల్స్ ఉండాలనే సంగతి తెలిసిందే.ఐపీఎస్ బాలస్వామి( IPS Balaswami ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.
బాలస్వామి కుటుంబ సభ్యులు, బంధువులు నిరక్షరాస్యులు కాగా బడికి పోవాలన్నా బాలస్వామి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం గమనార్హం.పుస్తకాలు కొనడానికి కూడా బాలస్వామికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బాలస్వామి మాత్రం చదువు విషయంలో వెనుకడుగు వేయలేదు.పట్టుదలతో చదివిన బాలస్వామి ఇంటర్ పూర్తైన వెంటనే జూనియర్ అసిస్టెంట్ జాబ్( Jr.Assistant ) సాధించారు.ఒకానొక సమయంలో కూలి పనులు చేసిన బాలస్వామి తెలుగు మీడియంలో చదివారు.
నైపుణ్యాలు కూడా లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.రెండేళ్ల పాటు జాబ్ చేసిన బాలస్వామి ఆ తర్వాత పెద్ద చదువులు చదవడం కోసం జాబ్ కు రిజైన్ చేసి హైదరాబాద్ కు వచ్చారు.

దూరవిద్యలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన బాలస్వామి ఉస్మానియా యూనివర్సిటిలో( Osmania University ) అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ లో చేరారు.ఆ తర్వాత రోజుల్లో బాలస్వామి ఐపీఎస్ పై దృష్టి పెట్టారు.తెలుగు మీడియం( Telugu Medium ) కావడంతో సివిల్స్ సాధించగలనా అనే సందేహం బాలస్వామిని వేధించేది.నాలుగో ప్రయత్నంలో ఐ.ఆర్.ఎస్ కు ఎంపికైన బాలస్వామి ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించారు.

2018 సంవత్సరంలో విడుదలైన ఫలితాలలో ఐపీఎస్ గా ( IPS ) ఎంపికైన బాలస్వామి 2020 సంవత్సరంలో మెదక్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా ఎంపికయ్యారు.బాలస్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎస్ సాధించడం నా కల అని తెలిపారు.నిజాం కాలేజ్ లో కూడా నేను పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.బాలస్వామి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రైతుబిడ్డ బాలస్వామి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.