నల్లగొండ జిల్లా: చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంబంధించే దారిని వెతుక్కుంటూ బైకులను దొంగతనం చేసి,వాటిని విక్రయించి,వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్న ఏపీ మాచర్లకు చెందిన రాజా అనే అంతరాష్ట్ర బైక్ దొంగను నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.శుక్రవారం కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం…ఈనెల మూడు నాలుగు తేదీలలో అర్ధరాత్రి సమయాలలో కొండమల్లేపల్లి పట్టణంలోని రెండు ఇళ్ళ ముందు పార్కు చేసిన రెండు పల్సర్ బైక్ లను కొట్టేశాడని,
మాచర్ల నుండి ఒకరోజు ముందుగానే వచ్చి పక్కాగా ప్లాన్ వేస్తూ నిర్మానుషంగా ఉన్న ప్రాంతాలలో వెతుక్కుంటూ దొంగతనాలకు పాల్పడుతుంటాడని,ఇట్టి కేసును కొండమల్లేపల్లి ఎస్సై క్రైమ్ సిబ్బందితో కలిసి సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి శుక్రవారం ఉదయం 10 గంటలకు పెండ్లిపాకుల ఎక్స్ రోడ్ వద్ద పట్టుబడి చేసి రెండు బైకులను స్వాధీన పరుచుకుని సీజ్ చేసి,రిమాండ్ కు తరలించామన్నారు.
కేసులను చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి,క్రైం సిబ్బందిని దేవరకొండ డిఎస్పీ, కొండమలపల్లి సిఐ ధనుంజయ అభినందించారు.