నల్లగొండ జిల్లా: సిపిఐ(ఎం)అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడవడం దేశానికి, కమ్యూనిస్టులకు తీరని లోటని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను,సిపిఎం మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ అన్నారు.శుక్రవారం నిడమనూరు సిపి(ఐ)ఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ ఏచూరి మరణం యావత్ దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని,దేశం ఒక మంచి మేధావిని కోల్పోయిందని, పేదల కోసం కష్టజీల కోసం కార్మికుల కోసం రైతుల కోసం ఆయన దేశవ్యాప్తంగా అనేక పోరాటాలను ఉద్యమాలను రూపొందించారని,
వామపక్ష,ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ఐక్యతకు దేశంలో ఆయన కీలక భూమిక పోషించారని కొనియాడారు.ఏచూరి విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడై విద్యార్థి యువజన సంఘాలలో, క్రియాశీలకంగా పని చేశారని,జే.
ఎన్.యూ యూనివర్సిటీ నాయకునిగా,ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి సిపిఎం సభ్యునిగా, వరుసగా మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు.దేశ రాజకీయాలలో ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడని,రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉండి పార్లమెంటుకు అనేక సలహాలు సూచనలు చేశారని, ఏచూరు లాంటి మేధావి, ప్రజా సమస్యల పట్ల, కార్మికుల రైతుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి ఏచూరి ప్రసంగం వినడానికి పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆయన సూచనల కోరకు ఎదురుచూసే వారిని వారన్నారు.
అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్న గొప్ప మేధావి అని, అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని,అనేక దేశాల కమ్యూనిస్టు నాయకులతో కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాణానికి సలహాలు సూచనలు,చర్చలు చేసే వారినితెలిపారు.
ఆయన స్వతహాగా తెలుగు వారైనప్పటికీ తండ్రి ఉద్యోగ వృత్తిరీత్యా ఢిల్లీకి వెళ్లిపోయి స్థిరపడ్డారని, పూర్వ విద్యాభ్యాసం హైదరాబాద్ లో కొనసాగిందని,జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇచ్చే వారిని తెలిపారు.మతోన్మాదుల పట్ల మతతత్వ విధానాల పట్ల ఆయన పూర్తి కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి నిలబడ్డారని,
మతోన్మాదుల పట్ల స్పష్టమైన అవగాహనతో దానివల్ల వచ్చే ప్రమాదాలను పరిణామాలను ఆయన స్పష్టంగా దేశ ప్రజానీకానికి తెలియజేశారని,దేశం పట్ల ముందు చూపు ఉన్న మహా మేధావిని కోల్పోయిందన్నారు.
ఏచూరి మరణానికి సంతాపని ప్రకటిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బొజ్జ చిన్న మాదిగ, సిఐటియు మండల కన్వీనర్ కోమండ్ల గురువయ్య,సిపిఎం మండల కమిటీ సభ్యులు మల్లికంటి చంద్రశేఖర్, వింజమూరు శివ,కొంచెం శేఖర్,తోటపల్లి బాల నారాయణ,కోదండ చరణ్ రాజ్,కోమండ్ల ఆంజనేయులు, మారయ్య,బొజ్జ యేసు,చంద్రయ్య,గోపి తదితరులు పాల్గొన్నారు.