శ్రీదేవి, జయప్రద తొలిసారి కలుసుకున్న సందర్బం ఇదే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి తారలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో శ్రీదేవి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ నటీమణులు ఇద్దరు కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.

 Interesting Incident In Dasari Maa Bangarakka Movie Where Sridevi Jayaprada Met-TeluguStop.com

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోయిన్స్ మొట్టమొదటిసారిగా ఎలా.ఎక్కడ కలుసుకున్నారనే విషయానికి వస్తే…

దాసరి నారాయణరావు దర్శకత్వంలో “మా బంగారక్క” చిత్రం తెరకెక్కింది.ఈ సినిమా షూటింగ్ చెన్నైలో కాకుండా హైదరాబాద్లోనే సారధి స్టూడియోలోనే జరగాలని నవయుగ ఫిల్మ్స్‌ అధినేతలు కండిషన్‌ పెట్టారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించడం కోసం చిత్రంలో మురళీమోహన్‌, శ్రీదేవి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ఈశ్వరరావు, రమాప్రభ, నిర్మల నటించారు.

 వీరందరూ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది.

Telugu Dasarimaa, Jaya Pradha, Ma Bangarakka, Saradhi Stuidos, Sridevi, Tollywoo

ఇలా వచ్చి పోవడానికి ఖర్చులు ఎక్కువ అవుతాయని వీరందరినీ హోటల్లో ఉంచినప్పటికీ అధిక బడ్జెట్ అవుతుందని భావించిన దాసరి నారాయణరావు వీరందరినీ సారథి స్టూడియోలోనే రూములను ఏర్పాటు చేసి అక్కడ ఉంచారు.ఇలా స్టూడియోలో ఉంటూనే షూటింగ్ లో పాల్గొనే వారు.ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓపెనింగ్ రోజున ఈ సినిమాకు ముఖ్య అతిథులుగా జయప్రద, మాధవి హాజరయ్యారు.

ఈ కార్యక్రమం సందర్భంగా జయప్రద, శ్రీదేవి మొట్టమొదటిసారిగా కలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube