నటుడిగా సూపర్ స్టార్ కృష్ణ పాపులారిటీని సంపాదించుకుంటే గాన గంధర్వుడిగా ఎస్బీ బాలు పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.అయితే చాలా సంవత్సరాల క్రితం కృష్ణ, ఎస్పీ బాలు మధ్య ఒక గొడవ జరిగింది.
ఆ గొడవ వల్ల కృష్ణ హీరోగా నటించే సినిమాలకు ఎస్పీ బాలు పాటలు పాడలేదు.అయితే ఈ వివాదం ఏ కారణం వల్ల మొదలయ్యిందో నేటితరం ఫ్యాన్స్ లో చాలామందికి తెలియదు.
పద్మాలయ శర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ గొడవ గురించి చెప్పుకొచ్చారు.
ఇందిరా గాంధీ గురించి వింధ్యా కృష్ణ బ్యానర్ లో ఒక బుర్ర కథ చేశారని ఆ బుర్రకథకు ఎస్పీ బాలు ప్లే బ్యాక్ చేశారని పద్మాలయ శర్మ అన్నారు.
విజయనిర్మల, కృష్ణగారికి కాంగ్రెస్ పార్టీపై మక్కువ ఉందని అందువల్ల ఇందిరా గాంధీపై అభిమానంతో ఎస్పీ బాలుతో పాటలు పాడించుకున్నారని పద్మాలయ శర్మ వెల్లడించారు.అయితే పేమెంట్స్ విషయంలో వివాదం చెలరేగిందని పద్మాలయ శర్మ అన్నారు.
అప్పట్లో పేమెంట్స్ నిదానంగా జరిగేవని అందువల్ల సమస్య వచ్చిందని పద్మాలయ శర్మ వెల్లడించారు.

ఆ తర్వాత కృష్ణ సింగర్ రాజ్ సీతారామ్ కు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారని పద్మాలయ శర్మ అన్నారు.ఈ వివాదం గురించి ఒక సందర్భంలో ఎస్పీ బాలు కూడా స్పందించారు.తాను తొలిసారి నేనంటే నేనే సినిమా కోసం అన్ని పాటలు పాడారని ఎస్పీ బాలు పేర్కొన్నారు.
ఒక మూవీ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత తనతో మాట్లాడిన మాటలను మరో విధంగా చెప్పారని ఎస్పీ బాలు అన్నారు.

ఆ సమయంలో కృష్ణ గారు ఫోన్ చేసి మీరు పాటలు పాడకపోతే సినిమాలు సక్సెస్ అవ్వవా అని అన్నారని ఆ మాటల వల్ల ఆత్మగౌరవం దెబ్బ తినడంతో తాను పాటలు పాడలేదని బాలు తెలిపారు.సింహాసనం సినిమాలోని పాటలను రాజ్ సీతారాం పాడగా బాలు ఆ పాటలను పాడి ఉంటే మరో విధంగా ఉండేదని కామెంట్లు వినిపించాయి.