ఆయన వల్లే మందు అలవాటు చేసుకున్న నటుడు మురళీ మోహన్.. ఎవరంటే?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మురళీ మోహన్ నటుడిగా, నిర్మాతగా, రాజకీయనేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యాపారంలో సక్సెస్ అవుతున్న సమయంలో సినిమాల్లోకి వెళ్లాలా? వద్దా? అని తాను చాలా ఆలోచించానని తెలిపారు.తాను చెడు అలవాట్ల బారిన పడితే పరిస్థితి ఏంటని కూడా ఆలోచించానని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

 Interesting Facts About Actor Murali Mohan Details Here Goes Viral , Akkineni N-TeluguStop.com

చిరంజీవి గారు తనను ఇప్పటికీ అన్నయ్య అని పిలుస్తారని మురళీ మోహన్ వెల్లడించారు.

మన సినిమాలను మనమే నిర్మిస్తే మంచి కథను ఎంచుకోవచ్చని బాగా తీయవచ్చని ఆయన తెలిపారు.దాసరి నారాయణరావు పెద్ద డైరెక్టర్ కావడంతో ఆయనతో కాకుండా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించానని మురళీ మోహన్ తెలిపారు.

మణిరత్నం ఇద్దరు సినిమాతో భారీ మొత్తంలో నష్టం వచ్చిందని మురళీ మోహన్ అన్నారు.

ఇద్దరు సినిమాతో అప్పటివరకు నేను సంపాదించిన డబ్బు అంతా పోగొట్టుకున్నానని ఆయన తెలిపారు.

అయితే ఇంచుమించుగా మా బ్యానర్ లో తీసిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయని ఆయన చెప్పుకొచ్చారు.అతడు సినిమా సమయంలో బడ్జెట్ కంట్రోల్ చేయలేకపోయామని ఆయన వెల్లడించారు.

త్రివిక్రమ్ రెండో సినిమా అతడు అని ఆయన వెల్లడించారు.

Telugu Budget Control, Chiranjeevi, Dasari Yana Rao, Maniratnam, Murali Mohan, C

సినిమాల్లోకి వచ్చేముందు సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకున్నానని ఆయన అన్నారు. ఏఎన్నార్ 60 సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి లిమిటెడ్ గా డ్రింక్ తీసుకోవాలని చెప్పారని ప్రస్తుతం పార్టీలో మాత్రమే డ్రింక్ చేస్తానని ఆయన కామెంట్లు చేశారు.బంగారక్క మూవీ షూటింగ్ సమయంలో ఒక చిన్న పాప బురదలో కూరుకుపోయి చనిపోయిందని ఆ ఘటన అప్సెట్ చేసిందని ఆయన వెల్లడించారు.

తన లైఫ్ లో వేర్వేరు సందర్భాల్లో ఎదురైన అనుభవాల గురించి మురళీ మోహన్ అభిమానులతో పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube