అమెరికాలో భారతీయులకి కొదవలేదు.అందుకే కాబోలు అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు చూసినా సరే భారీయుల పై ఏడుస్తూ ఉంటాడు.
అయినా సరే మనోళ్ళు ఎవరిని లెక్క చేయరు కదా అందుకు తగ్గట్టుగానే ఈ సారి ట్రంప్ తిక్క తీర్చడానికి సమోసా రూపంలో ట్రంప్ కి షాక్ ఇవ్వడానికి సిద్ద పడ్డారు.అదేంటి సమోసా లో షాక్ అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే.
అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న ఐదుగురు భారతీయ-అమెరికన్ సభ్యులను కలిపి “సమోసా కాకస్” అంటారు.కృష్ణమూర్తే ఈ పేరును బృందానికి పెట్టారు.తాజా మధ్యంతర ఎన్నికలతో సమోసా బృందంలోని సభ్యుల సంఖ్య పెరుగుతుందని భారీగా అంచనాలు వేస్తున్నారు.ఈ ఎన్నికలు చాలామంది కొత్త వారిని ప్రతినిధుల సభ, రాష్ట్రాల శాసన సభలకు పంపుతాయని రిచ్ వర్మ తెలిపారు.
ఆరిజోనా నుంచి టెక్సాస్, ఒహయో, మిషిగాన్‌ల వరకు.ఎన్నో రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారని వారిలో ఎంతో మంది పోటీలు చేస్తున్నారని తెలుస్తోంది అయితే మధ్యంతర ఎన్నికల తరువాత తప్పుకుండా అమెరికన్ కాంగ్రెస్‌లో భారతీయుల బలం పెరుగుతుందని నమ్మకం ఉందని అంటున్నారు కృష్ణమూర్తి.ట్రంప్ విధానాలతో భారతీయ అమెరికన్లు తీవ్ర ఆందోళనకి లోనవుతున్నారని.తమ నిరసనను గట్టిగా చెప్పడం కోసమే ఈసారి అనేక మంది భారతీయ అమెరికన్లు బరిలోకి దిగారని వర్మ తెలిపారు.
.