Indian Racing League : అసలు ఏంటి ఈ ఇండియన్ రేసింగ్ లీగ్..

రయ్‌ రయ్‌ అంటూ హోరెత్తించే శబ్దాలు.కళ్లు మూసి తెరిచే లోపు మాయమయ్యే కార్లు.

 Indian Racing League Launched, Starts November 19,indian Racing League,hyderabad-TeluguStop.com

వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా సాగే వేగ విన్యాసాలు! ఫార్ములావన్‌ కారు రేసింగ్‌లో కనిపించే కొన్ని చిత్రాలివి.సరిగ్గా అలాంటి దృశ్యాలకు హైదరాబాద్‌ వేదికగా నిలవనుంది.

హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందడి చేయనుంది.ఫార్ములావన్‌ స్థాయిలో కాకపోయినా అలాంటి అనుభూతులతో అభిమానుల్ని అలరించనుంది.
ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌. మోటార్‌స్పోర్ట్స్‌ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది.ఆరు జట్లు.24 మంది డ్రైవర్లు పాల్గొనే రేసింగ్‌ లీగ్‌ నాలుగు రౌండ్ల పాటు సాగుతుంది.ఈనెల 19, 20 తేదీల్లో మొదటి రౌండ్‌.డిసెంబరు 10, 11 తేదీల్లో నాలుగో రౌండ్‌ రేసులకు హైదరాబాద్‌ వేదికగా నిలవనుంది.ఈనెల 25-27, డిసెంబరు 2-4 వరకు వరుసగా రెండు, మూడో రౌండ్‌ రేసులకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.ఆరు జట్లలో నలుగురు చొప్పున డ్రైవర్లు ఉంటారు.

ప్రతి జట్టులో ఒక మహిళా డ్రైవర్‌ ఉంటుంది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొట్టమొదటి ఎఫ్‌ఐఏ ఫార్ములా ఇ రేసు హైదరాబాద్‌లో జరుగనున్న నేపథ్యంలో తాజా సర్క్యూట్‌ ట్రయల్‌ రన్‌లా పనిచేయనుంది.

అసలు ఇంతకు ఈ రేసు ఎంటి ఎవరు నిర్వహిస్తున్నారు.ఎందుకు నిర్వహిస్తున్నారు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం.మోటార్‌స్పోర్ట్స్‌లో ఫార్ములావన్‌ అత్యున్నత రేసు.చాలామంది డ్రైవర్లు నేరుగా ఫార్ములావన్‌ రేసులో పాల్గొనలేరు.అక్కడికి చేరుకునేందుకు ఎఫ్‌4తో మొదలుపెట్టి.ఎఫ్‌3లో బరిలో దిగి.ఎఫ్‌2 స్థాయికి చేరుకుంటారు.ఆ తర్వాతే ఫార్ములావన్‌లో బరిలో దిగే అవకాశం లభిస్తుంది.

అయితే ఈ ఫార్ములా రేసుల్లో పాల్గొనడం అందరికీ సాధ్యం కాదు.దీంతో భారత్‌లో ఉన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేసిందే ఐఆర్‌ఎల్‌.

అమెరికాలో ఇండికార్‌, జపాన్‌లో సూపర్‌ ఫార్ములా మాదిరిగా మనకంటూ ఇది సొంత రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌.ఆరు జట్లలో స్వదేశీ, విదేశీ డ్రైవర్లు ఉంటారు.

ప్రస్తుత సీజన్‌లో 24లో 12 మంది అంతర్జాతీయ రేసింగ్‌ డ్రైవర్లు కాగా.అందులో ఆరుగురు మహిళలు ఉన్నారు.

ప్రతి రౌండ్లో రెండు స్ప్రింట్‌, ఒక ఫ్యూచర్‌ రేసు ఉంటాయి.శనివారం జరిగే మొదటి స్ప్రింట్‌ రేసు ఆదివారం నాటి స్ప్రింట్‌కు పోల్‌ పొజిషన్‌ నిర్ణయిస్తుంది.స్ప్రింట్‌ రేసులో ఒక్కో జట్టు నుంచి రెండు కార్లు పోటీలో నిలుస్తాయి.మొత్తం 12 కార్లు ట్రాక్‌పై పరుగులు తీస్తాయి.ప్రతి కారులో ఒక్క డ్రైవర్‌ ఉంటారు.20 నిమిషాల్లో రేసు ముగుస్తుంది.ఈ నిర్ణీత సమయంలో పూర్తిచేసిన ల్యాప్‌ల సంఖ్య ఆధారంగా ఆయా జట్లకు పాయింట్లు కేటాయిస్తారు.ఆదివారం ఫ్యూచర్‌ రేసు జరుగుతుంది.ఒక్కో కారులో ఇద్దరు డ్రైవర్లు చొప్పున 12 కార్లు రేసులో బరిలో ఉంటాయి.మధ్యలో డ్రైవర్‌ మారేందుకు అవకాశం ఉంటుంది.

ఈ రేసు నిడివి 40 నిమిషాలు.హైదరాబాద్‌, చెన్నైలలో నాలుగు రౌండ్ల అనంతరం అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.చెన్నైలో 3.7 కిమీ ట్రాక్‌ ఉండగా.హైదరాబాద్‌లో 2.7 కిమీ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ చుట్టూ అన్ని హంగులతో ట్రాక్‌ను రూపొందిస్తున్నారు.ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రేసుల్ని స్టార్‌ స్పోర్ట్స్‌ 2 ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.ప్రత్యక్షంగా చూడాలనుకుంటే బుక్‌మైషో.

కామ్‌లో టిక్కెట్లు కొనుక్కోవచ్చు.

రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఐఆర్‌ఎల్‌ జరుగనుంది.ఇటలీకి చెందిన కార్ల తయారీ సంస్థ వోల్ఫ్‌ రేసింగ్‌ బృందం ఐఆర్‌ఎల్‌ కార్లు, సాంకేతికను పర్యవేక్షించనుంది.ఈ కారు గరిష్టంగా గంటకు 250 కిమీ వేగంతో ప్రయాణించనుంది.220 బీహెచ్‌పీ, 1.1 లీటర్‌ ఇంజిన్‌ సామర్థ్యం ఉంటుంది.కారు బరువు 380 కిలోలు. ఫార్ములావన్‌ కారు గరిష్టంగా గంటకు 400 కిమీ వేగంతో దూసుకెళ్తుంది.

దేశంలో జరుగుతున్న మొట్టమొదటి ఐఆర్‌ఎల్‌లో తెలుగబ్బాయి కొండా అనిందిత్‌రెడ్డి కూడా ఉన్నాడు.మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ సంయుక్త ఎండీ సంగీతారెడ్డిల తనయుడు అతను.

హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ జట్టు తరఫున బరిలో ఉన్నాడు.రేసింగ్‌లో ఏడేళ్ల అనుభవమున్న అనిందిత్‌.ట్రాక్‌పై తనదైన ముద్ర వేశాడు.2016 యూరో జేకే 16 ఛాంపియన్‌షిప్‌, 2017 యూరో జేకే ఛాంపియన్‌షిప్‌లో అనిందిత్‌ విజేతగా నిలిచాడు.ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా 2017 మోటార్‌స్పోర్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు.

Indian Racing League launched, starts November 19

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube