నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నలుగురి మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసి పలు అభియోగాలు మోపారు.నిందితుడిని హరీందర్ సింగ్ రంధవాగా గుర్తించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని పోలీస్ కస్టడీలోనే వుంచి చికిత్స అందిస్తున్నారు.సెంట్రల్ విక్టోరియా ప్రావిన్స్‌లోని షెప్పర్టన్ సమీపంలో వున్న పైన్ లాడ్జ్ వద్ద టయోటా హిలక్స్ వాహనాన్ని హరీందర్ వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.జూన్ 8న మెల్‌బోర్న్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో రాంధావా విచారణ జరగనుంది.
నలుగురు భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని.అయితే ప్రమాద సమయంలో వారు సీటు బెల్ట్ ధరించి వున్నారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాధితులను పంజాబ్‌లోని ముక్తసర్‌కు చెందిన హర్పాల్ సింగ్, జలంధర్‌కు చెందిన భూపీందర్ సింగ్, తరన్ తరణ్‌కు చెందిన బల్జీందర్ సింగ్, కిషన్ సింగ్‌లుగా గుర్తించారు.వీరంతా ఆస్ట్రేలియాలోని తమ బంధువులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు టూరిస్ట్ వీసాపై వచ్చినట్లు మెల్‌బోర్న్‌కు చెందిన సామాజిక కార్యకర్త పుల్విందర్‌జిత్ సింగ్ గ్రేవాల్ తెలిపారు.
ఇదిలావుండగా.నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ భారతీయ మహిళ మరణానికి కారణమైన వ్యక్తికి రెండ్రోజుల క్రితం యూకే కోర్ట్ ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.నిందితుడు అజీజ్ దాదాపు 100 కి.మీ వేగంతో వాహనాన్ని నడిపినట్లు దర్యాప్తులో తేలింది.వివరాల్లోకి వెళితే.గతేడాది నవంబర్‌లో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో నిందితుడు నడుపుతున్న ఆడి 3 కారు.బాధితురాలైన బల్జిందర్ కౌర్ మూర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.ఆ సమయంలో నిందితుడి కారు 100 కి.మీ.బల్జీందర్ కౌర్ కారు 63 కి.మీ వేగంతో వున్నాయి.బాధితురాలు తన సోదరుడి ఇంటి నుంచి తన భర్తను తీసుకురావడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
విచారణ సందర్భంగా ఇద్దరు సాక్షులు అజీజ్ కారు తమను దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో దాటి వెళ్లిందని వోల్వర్‌హాంప్టన్ కోర్టుకు తెలిపారు.ఘటనాస్థలికి 30 మీటర్ల దూరంలో శిథిలాలు చెల్లాచెదురుగా పడి వున్నాయని.కారు నుంచి ఇంజిన్ విడిపోయిందంటూ ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవచ్చని ప్రాసిక్యూటర్ కాథ్లిన్ ఆర్చర్డ్ తెలిపారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బల్జీందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది ప్రకటించినట్లు ఆయన కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.