చైనా చేతిలో ఓటమిని చవిచూసిన భారత ఫుట్‌బాల్‌ జట్టు..!

చైనా వేదికగా జరిగిన ఏసియన్స్ గేమ్స్ లో( Asian Games ) మంగళవారం భారత్ 1-5 తేడాతో చైనా చేతిలో చిత్తుగా ఓడింది.సునీల్ ఛేత్రి( Sunil Chhetri ) సారధ్యంలోని భారత జట్టు ప్రత్యర్థి జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

 Indian Football Opens Hangzhou 2023 Campaign With A 1-5 Loss To China Details, I-TeluguStop.com

భారత్ తరపున రాహుల్ కేపీ (45+1) నిమిషంలో ఏకైక గోల్ చేయగా.మిగిలిన భారత జట్టు ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు.

చైనా ఆటగాళ్లు ఏకంగా ఐదు గోల్స్ చేసి భారత్ ఓడించారు.

భారత జట్టు ఆటగాడైన రాహుల్ కే పీ( Rahul KP ) గోల్ చేయడంతో మొదటి అర్థభాగం 1-1 తో ముగిసింది.

రెండో అర్థ భాగంలో చైనా ఆటగాళ్లు( China ) ఏకంగా నాలుగు గోల్స్ చేశారు.చైనా ఆటగాళ్ల దూకుడుకు భారత ఆటగాళ్లు( India ) అడ్డుకట్ట వేయలేకపోయారు.

ఇక భారత జట్టు రెండో రౌండ్ కు అర్హత సాధించాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచ్లలో కచ్చితంగా బంగ్లాదేశ్, మయమ్మర్ జట్లను ఓడించాల్సి ఉంది.

ఏషియన్ గేమ్స్ లో భారత జట్టును పంపించడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించగా టీం కోచ్ నేరుగా ప్రధానికి విజ్ఞప్తి చేశాడు.దాంతో ఫుట్‌బాల్‌ టీం( Football Team ) బరిలోకి దిగడంపై గ్రీన్ సిగ్నల్ వచ్చింది.అయితే అత్యుత్తమ ఆటగాలను ఇవ్వలేమంటూ ఐఎస్ఎల్ జట్లు అడ్డు తగిలాయి.

చివరి నిమిషంలో తృతీయ శ్రేణి జట్టుతో బరి లోకి దిగిన భారత జట్టు ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే 16 గంటల వ్యవధిలో తొలి మ్యాచ్ ఆడింది.భారత జట్టు జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు కూడా రాసుకోలేని పరిస్థితి.సబ్స్టిట్యూట్ లుగా దించేందుకు తగినంత మంది కూడా బెంచి పై లేరంటే భారత జట్టు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube