అమెరికాలో అరెస్ట్ అయిన 'భారత ఎన్నారై' దంపతులు

అమెరికాలో భారతీయ దంపతులని అరెస్ట్ చేశారు అక్కడి పోలీసు అధికారులు.అక్కడి ఆసుపత్రి అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వారు ఈ ఇద్దరు భారత ఎన్నారై దంపతులని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు.

 Indian Couple In Us Arrested For Child Abuse Negligence-TeluguStop.com

ఇంతకీ వారిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.? వారు చేసిన నేరం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు.ఇంతకీ పోలీసులు ఎందుకు వారిని అరెస్ట్ చేశారంటే.తమిళనాడుకు చెందిన ప్రకాశ్‌ సేతు, మాలా పన్నీర్‌సెల్వం దంపతులు ఉద్యోగ రీత్యా ఫ్లోరిడాలో ఉంటున్నారు.వీరికి ఆరు నెలల వయసున్న కవలపిల్లలు ఉన్నారు.ఇటివల వీరి కుమార్తె హిమిష అనారోగ్యానికి గురవడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే అక్కడ వారి పాపకి కొన్ని టెస్ట్ లు చేయించాల్సి ఉండటంతో ఆ దంపతులు ఇద్దరూ నిరాకరించారు దాంతో ఆసుపత్రి వైద్యులు ఆ దంపతులు ఇద్దరిపై స్థానికంగా ఉన్న ఛైల్డ్‌ ప్రొటెక్టివ్‌ సర్వీసెస్‌కు సమాచారమిచ్చారు అనారోగ్యంతో ఉన్న చిన్నారికి వైద్య పరీక్షలు చేయించకుండా నిర్లక్ష్యం చేసినందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.శిశు సంరక్షణ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రకాశ్‌, మాలాను పోలీసులు గతవారం అరెస్టు చేశారు.

అయితే తాజాగా వీరు బెయిల్ పై విడుదల అయ్యారు.ఈ విషయంపై ఆ దంపతుల సన్నిహితులు మాత్రం ఈ వ్యాఖ్యలని ఖండిస్తున్నారు.సదరు వైద్యులు చెప్పిన మెడికల్‌ టెస్టులు చేయించేందుకు వారి వద్ద సరిపడా డబ్బు లేదు అయితే వారి ఇన్స్యూరెన్స్‌లో సైతం అన్నీ కవర్‌ అవట్లేదు.అందుకే వారు చేయించలేదు అన్నట్లు వారు తెలిపారు…ఈ మాత్రం దానికి విచారణ చేయకుండానే అరెస్ట్ చేయడం దారుణం అని , చిన్నారులని తల్లి తండ్రులకి దూరం చేయడం దురదృష్టం అని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube