అమెరికన్ హిందూ యూనివర్సిటీకి ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భారీ విరాళం..!!

అమెరికాలోని( America ) ఫ్లోరిడా రాష్ట్రంలో వున్న హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (హెచ్‌యూఏ)కు ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భారీ విరాళాన్ని ప్రకటించారు.హ్యూస్టన్‌లోని స్టార్ పైప్ ప్రొడక్ట్స్ సీఈవో రమేశ్ భూటాడా( Ramesh Bhutada ) హెచ్‌యూఏకు ఒక మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8.20 కోట్లు) విరాళాన్ని అందజేశారు.ఈ వర్సిటీకి ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద విరాళం ఇదే.అమెరికాలో హిందూ తత్వ శాస్త్ర సిద్ధాంతాలను బోధించే ఏకైక సంస్థ ఇదే.ఇది 1989లో ప్రారంభమైన హెచ్‌యూఏ 1993లో ఫ్లోరిడా ప్రభుత్వ గుర్తింపు పొందింది.

 Indian-american Entrepreneur Ramesh Bhutada Donates Usd 1m To Hindu University O-TeluguStop.com
Telugu America, Donates Usd, Florida, Hindu, Hindu America, Houston, Indianameri

భూటాడా మాట్లాడుతూ.యువత హిందూ మతం గురించిన జ్ఞానాన్ని, అవగాహనను పొందేందుకు, వారు జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు గాను ఈ విరాళాన్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు.హ్యూస్టన్‌లో ( Houston ) జరిగిన ఒక కార్యక్రమంలో రమేశ్‌ను హెచ్‌యూఏ ఘనంగా సత్కరించింది.

సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ, ఎన్నో హిందూ సంస్థల్లో సభ్యుడిగా వున్నప్పటికీ తాను హిందూ మత సారాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని రమేశ్ పేర్కొన్నాడు.హిందూ మతం యొక్క నిజమైన సారాన్ని అర్ధం చేసుకోవడానికి తనకు 60 ఏళ్లు పట్టిందన్నారు.

Telugu America, Donates Usd, Florida, Hindu, Hindu America, Houston, Indianameri

ఈ సందర్భంగా హెచ్‌యూఏ అధ్యక్షుడు కళ్యాణ్ విశ్వనాథన్ మాట్లాడుతూ.తంజావూరులోని బృహదీశ్వరాలయం 1000 ఏళ్లకు పైగా పటిష్టంగా వుందని తెలిపారు, జ్ఞానదీవిగా నిలిచిన నలంద యూనివర్సిటీలాగా 1000 ఏళ్లపాటు కొనసాగే హిందూ యూనివర్సిటీని నిర్మించేందుకు తమతో కలిసి రావాలని ఆయన హిందూ సమాజాన్ని కోరారు.నలంద యూనివర్సిటీని 1700 సంవత్సరాల క్రితం నాశనం చేయబడిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.యూనివర్సిటీ ఛైర్మన్ వేద్ నందా మాట్లాడుతూ.హెచ్‌యూఏ.అమెరికాలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మానికి సంబంధించిన అన్ని విషయాల కోసం అకడమిక్ డొమైన్‌లో అధికారిక వాయిస్‌గా మారడానికి ప్రయత్నిస్తుందన్నారు.

హెచ్ఏయూతో పాటు కొన్ని హిందూ సంస్థలు కూడా అమెరికాలో సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube