తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) ఒకరు.ముంబైలో పుట్టి పెరిగినటువంటి ఈమె నటనపై ఆసక్తితో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇలా లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి కాజల్ అగర్వాల్ అనంతరం చందమామ, మగధీర వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే ఈమె వివాహం చేసుకొని సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.
ప్రస్తుతం తిరిగే సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోయారు.
ఇకపోతే ఒకానొక సమయంలో ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ ( Bollywood )సినిమాలను మాత్రమే చెప్పుకునేవారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కోసం చాలామంది దక్షిణాది సినీ ఇండస్ట్రీపై( South Industry ) సంచలన వ్యాఖ్యలు చేస్తూ అక్కడ అవకాశాలు అందుకోవాలని భావించారు.ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే తాజాగా కాజల్ అగర్వాల్ మాత్రం సౌత్ ఇండస్ట్రీ గురించి ఎంతో గొప్పగా వివరించారు.
తాజాగా రైజింగ్ ఇండియా( Raising India ) అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాజల్ అగర్వాల్ కు యాంకర్ నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇందులో భాగంగానే ఈమె తన సినీ కెరియర్ గురించి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు తెలిపారు.
ఈ క్రమంలోనే యాంకర్ కాజల్ అగర్వాల్ ను ప్రశ్నిస్తూ బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ మధ్య బేధాలు ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్నించగా కాజల్ సమాధానం చెబుతూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలువలు క్రమశిక్షణతో పాటు న్యాయం కూడా ఉంటుంది.కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవేవీ లేవు అంటూ ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు మొత్తం తీస్తూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా కాజల్ అగర్వాల్ సౌత్ ఇండస్ట్రీ గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె ఇండియన్ 2( Indian2) , బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.