నేడు 200వ టీ20 మ్యాచ్ ఆడనున్న భారత్.. అత్యధిక మ్యాచులు ఏ జట్టుతో అంటే..!

నేడు భారత్- వెస్టిండీస్( West Indies ) మధ్య జరిగే తొలి టీ 20 మ్యాచ్ బ్రియాన్ లారా స్టేడియంలో జరగనుంది.ఈ టీ20 మ్యాచ్ తో భారత జట్టు 200ల టీ20 మ్యాచ్లు పూర్తి చేసుకోనుంది.

 India Will Play 200th T20 Match Today.. Which Team Has The Most Matches..!, West-TeluguStop.com

ఇప్పటివరకు భారత్ 199 టీ20 మ్యాచులు ఆడి 127 చిలలో విజయం సాధించింది.భారత జట్టు తరుపున టీ20 లో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అంతేకాదు అత్యధిక అర్థ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.భారత జట్టు అత్యధిక టీ20 మ్యాచ్ లు శ్రీలంక( Sri Lanka)తో ఆడింది.శ్రీలంకతో ఆడిన 29 మ్యాచ్లలో భారత్ 19 మ్యాచ్ లు గెలిచింది.9 మ్యాచ్లలో ఓటమి చవి చూడగా ఒక మ్యాచ్ డ్రా అయింది.తర్వాత అత్యధిక మ్యాచులు ఆస్ట్రేలియా( Australia ) తో 26 మ్యాచులు ఆడి 15 మ్యాచ్లలో విజయం సాధించింది.ఇక న్యూజిలాండ్ తో 25 మ్యాచ్లు ఆడి 12 మ్యాచ్లు గెలిచింది.

పది మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది.

భారత్ తరపున టీ20 మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరు పై సరికొత్త రికార్డు ఉంది.కోహ్లీ 107 ఇన్నింగ్స్ లలో 4008 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీలు ఉన్నాయి.టీ20 లో భారత్ తరపున అత్యధిక అర్థ సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలిచాడు.

ప్రస్తుతం భారత జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తన 200వ టీ20 మ్యాచ్ అడనుంది.వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ అదే ఫుల్ ఫామ్ కొనసాగించి టీ20 సిరీస్ కూడా కైవసం చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.మూడవ వన్డే మ్యాచ్లో భారత్ ఏ విధంగా తన ఆటను ప్రదర్శించిందో అదే రీతిలో ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఈ సిరీస్ కూడా భారత్ ఖాతాలో పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube