ఐర్లాండ్ పర్యటనలో భారత్.. టీ20 సిరీస్ ఆడే భారత జట్టు ఇదే..!

ఐర్లాండ్ తో( Ireland ) మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది.భారత జట్టు( Indian Team ) సీనియర్లు లేకుండా జూనియర్లతోనే ఈ సిరీస్ లో తలపడనుంది.

 India Tour Of Ireland 2023 Squad Full Team List Details, India Tour Of Ireland 2-TeluguStop.com

ఆగస్టు 18 వ తేదీ శుక్రవారం రాత్రి 7:30 కు భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగునుంది.ఇప్పటికే జస్ప్రీత్ బూమ్రా( Jasprit Bumrah ) సారథ్యంలోని భారత జట్టు ఐర్లాండ్ చేరింది.

ప్రస్తుత భారత జట్టులో అంతా జూనియర్ ఆటగాళ్లే.ప్రస్తుత జట్టులో ఉండే ఆటగాళ్లు వచ్చే నెల ప్రారంభమయ్యే ఆసియా క్రీడలలో తలపడే జట్టులో ఉండే అవకాశం ఉంది.

కాబట్టి ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడే భారత జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి క్రికెట్ అభిమానులు అందరిలో నెలకొంది.ఐర్లాండ్ తో తలపడే జట్టులో యశస్వి జైస్వాల్,( Yasaswi Jaiswal ) రుతురాజ్ గైక్వాడ్ లు( Ruturaj Gaikwad ) ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు.

మూడవ స్థానంలో తిలక్ వర్మ బరిలోకి దిగనున్నాడు.నాలుగవ స్థానంలో ఆల్ రౌండర్ శివం దుబే ఆడనున్నాడు.ఐదవ స్థానంలో సంజూ శాంసన్ కు బదులుగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జితేశ్ శర్మ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu India Squad, India, India Ireland, Jasprit Bumrah, Jitesh Sharma, Rinku S

వెస్టిండీస్ సిరీస్ లో సంజూ శాంసన్( Sanju Samson ) 12,7,13 పరుగులతో నిరాశపరిచాడు.వికెట్ల వెనుక కూడా పెద్దగా రాణించలేకపోయాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ కు బదులు జితేశ్ శర్మ ను( Jitesh Sharma ) ఆడించే అవకాశాలు మెరుగుగా కనిపిస్తున్నాయి.

ఆసియా క్రీడలలో జితేశ్ శర్మ ను ఆడించాలంటే అంతర్జాతీయ అనుభవం కావాలి అందుకే ఐర్లాండ్ సిరీస్ లో జితేశ్ శర్మ కు అవకాశం ఇవ్వచ్చు.

Telugu India Squad, India, India Ireland, Jasprit Bumrah, Jitesh Sharma, Rinku S

ఐపీఎల్ లో అదరగొట్టిన రింకూ సింగ్( Rinku Singh ) ఆరో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఐపీఎల్ లో రింకూ సింగ్ ఏకంగా 450 పరుగులు చేశాడు.ఏడవ స్థానంలో వాషింగ్టన్ సుందర్, ఎనిమిదవ స్థానంలో రవి బిష్ణోయ్ ఆడే అవకాశం ఉంది.

ఇక భారత జట్టు బౌలర్ల విషయానికి వస్తే అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బూమ్రా, ప్రసిద్ధ కృష్ణ లు బరిలోకి దిగనున్నారు.ఒకవేళ సంజూ శాంసన్ కు మరో చివరి అవకాశం ఇవ్వాలనుకుంటే.

జితేశ్ శర్మ, రింకూ సింగ్ లలో ఎవరో ఒకరు బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube