ఆసియా ఛాంపియన్ గా అవతరించిన భారత్.. టైటిల్ కైవసం!!

ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ హాకీ మ్యాచ్ ( Hockey match )భారత్ వర్సెస్ మలేషియా మధ్య జరిగింది.శనివారం చెన్నై వేదికగా హోరా హోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.4-3 తేడాతో మలేషియానుమలేషియాను ఓడించింది.మ్యాచ్ ప్రారంభంలో తొలుత 1-3 తేడాతో మలేషియా అధిక్యంలో ఉంది.

 India Became The Champion Of Asia Asian Champions Trophy, India Won Asian Champ-TeluguStop.com

చివరి రెండు క్వార్టర్స్ లో భారత్ జట్టు పుంజుకుని ఆధిపత్యం చెలాయించి మూడు గోల్స్ సాధించగా.మలేషియా ఒక గోల్ కూడా వేయలేకపోయింది.

దీంతో ఆసియా చాంపియన్ ట్రోఫీ.( Asian Champions Trophy ).భారత్ వసమయింది.ఈ టైటిల్ గెలవడం ద్వారా భారత్ ఖాతాలో నాలుగో ఆసియా హాకీ( Asian Hockey ) టైటిల్ వచ్చి చేరింది.

నిన్న సెమీఫైనల్ లో జపాన్ తో తలపడ్డ భారత్ 5-0 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించడం జరిగింది.ఈ టోర్నీలో భారత్ హాకీ జట్టు కొత్త కోచ్ క్రేయిగ్ ఫుల్టన్ నేతృత్వంలో భారత జట్టు మొదటి నుండి దూకుడుగా ఆడుతూ వచ్చింది.

ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ లో భారత్ మలేషియాని ఓడించటంతో… భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube