నేను సాయి పల్లవికి పెద్ద అభిమానిని.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్?

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Im A Big Fan Of Sai Pallavi Senior Actress Shocking Comments, Sai Pallavi, Tolly-TeluguStop.com

ఈ క్రమంలోనే వరంగల్ లో ఆత్మీయ వేడుక అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ నటి ప్రియమణి భారతక్క పాత్రలో నటిస్తున్నారు.ఇక ఆత్మీయ వేడుకల్లో భాగంగా ప్రియమణి వేదికపై మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ తనకు సాయిపల్లవి అంటే ఎంతో ఇష్టమని సాయి పల్లవికి తాను పెద్ద అభిమానిని అంటూ తెలియజేశారు.మలర్‌గా నువ్ పరిచయమైనప్పుడు నా షోలో నువ్ వచ్చావ్.

  అప్పటి నుంచి ఇలా ఇప్పుడు మనిద్దరం కలిసి నటించే వరకు మన ప్రయాణం అద్భుతంగా ఉందని, నీవు ఇలాంటి మరెన్నో సినిమాలలో నటిస్తే చూడాలని ఉంది అంటూ ప్రియమణి సాయి పల్లవి గురించి తెలియజేశారు.

Telugu Priyamani, Sai Pallavi, Senior, Tollywood-Movie

ఈ సినిమాలో తను భారతక్క పాత్రలో నటించానని, ఈ సినిమాలో తనకు రానాతో ఎక్కువగా సీన్లు ఉన్నాయని తెలిపారు.విరాట పర్వం సినిమా ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైనదని ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ప్రియమణి ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక డైరెక్టర్ వేణు ఊడుగుల గురించి మాట్లాడుతూ ఆయన తనకు పెళ్లి అయిన కొత్తలో సినిమా నుంచే పరిచయం అని ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారని, ప్రస్తుతం డైరెక్టర్ గా మారి విరాట పర్వం వంటీ అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు అంటూ ఈ సందర్భంగా ప్రియమణి విరాట పర్వం సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube