ఐటీ సెక్టార్ లో సో కాల్డ్ కంపెనీల సక్సెస్ వెనక సీఈవోల కృషి ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.ఐటీ అనేకాదు, ఏ కంపెనీకైనా సీఈవో ( CEO )అనే పోస్ట్ చాలా కీలకంగా ఉంటుంది.
అందుకే మేనేజ్‌మెంట్లు వారికి రూ.కోట్లలో వేతనాలు చెల్లిస్తూ వుంటారు.ఆ శాలరీ ఒకసారి చూశారంటే అవాక్కవల్సిన పరిస్థితి ఉంటుంది.ఉదాహరణగా టాప్-5 ఐటీ కంపెనీల్లో ఎవరి సాలరీ ఏంటనే విషయం గురించి ఇపుడు తెలుసుకుందాం.ఐటీ కంపెనీల్లో అందరికంటే ఎక్కువ సాలరీ అందుకుంటున్నది హెచ్‌సీఎల్ సీఈవో అయినటువంటి సీ విజయకుమార్( C Vijayakumar ).

అవును, ఈయన 2022లో రూ.123.13 కోట్ల మేర వార్షిక వేతనం అందుకొని రికార్డు సృష్టించారు.స్థిర, చర వేతనాలు చెరో 2 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.అదే విధంగా ఇక రెండవ ప్లేసులో చూసుకుంటే విప్రో కంపెనీ సీఈవో అయినటువంటి ‘థెర్రీ డెలాపోర్ట్( Terry Delaporte )’ ఏడాదికి రూ.79.8 కోట్లకు పైనే తీసుకుంటున్నట్టు భోగట్టా.విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ( Azim Prem Ji ) అన్న సంగతి అందరికీ తెలిసినదే.ఇక రాబోయే వార్షిక ఏడాదిలో వాళ్ళ శాలరీలు మరింత పెరగనున్నాయని వినికిడి.

ఇక టాప్ త్రీ ప్లేసులో ఇన్ఫోసిస్ సిఈఓ నిలిచారు.ఇన్ఫోసిస్ సైతం గ్లోబల్ స్టాండర్డ్స్‌లో పే చేస్తోందనే విషయం అందరికీ తెలిసినదే.తాజా లెక్కల ప్రకారం, ఈ కంపెనీ సీఈవో ‘సలిల్ పారేఖ్( Salil Parekh )’ 2022లో రూ.71.02 కోట్లను వార్షిక వేతనంగా పొందినట్టు తెలుస్తోంది.కంపెనీ సక్సెస్ షేర్ లో అతనిది అగ్రస్థానం అని సర్వేలు చెబుతున్నాయి.అదేవిధంగా ఈ లిస్టులో నాల్గవ వ్యక్తి టెక్ మహీంద్రా సీఈవో అయినటువంటి ‘సీపీ గుర్నా( Cp gurna )’ని 2022లో రూ.63.4 కోట్లు ఆర్జించినట్టు లెక్కలు చెబుతున్నాయి.2021తో పోలిస్తే, ఈయనికి ఏకంగా 189 శాతం పెరగడం గమనార్హం.చివరగా టీసీఎస్ సీఈవో పదవికి ఇటీవల రాజీనామా చేసిన రాజేశ్ గోపీనాథన్ 2021-22లో ఆయన రూ.25.75 కోట్లు వార్షిక వేతనం పొందారు.అంతకు ముందుతో పోలిస్తే 27 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.