ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడం, యూకే ఇంటర్నెట్ రెగ్యులేటర్ ఆఫ్‌కామ్‌కు నాన్‌కాంప్లైంట్ సేవలను నిరోధించే అధికారాన్ని ఇవ్వడానికి యూకే ప్రభుత్వం రెడీ అవుతోంది.ఇందుకు యూకే ప్రభుత్వం ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లును ఆమోదించడానికి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ బిల్లును పాస్ చేస్తే వాట్సాప్ తన సేవలను మూసివేస్తామని బెదిరించింది.సెక్యూర్ మెసేజింగ్ యాప్‌ల ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఈ బిల్లు అణగదొక్కుతుందని, వాటిని తక్కువ సేఫ్టీగా మారుస్తుందని వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ చెప్పారు.

కోట్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్న వాట్సాప్ ఎన్‌క్రిప్షన్‌ను(WhatsApp encryption) నిరుపయోగంగా మార్చి వారి ప్రైవసీని ప్రమాదంలో పడేయడం కంటే వాట్సాప్‌ను యూకేలో నిలిపివేయడమే తమకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు.ఇకపోతే మరొక సెక్యూర్ మెసేజింగ్ యాప్ సిగ్నల్(App Signal) కూడాఈ బిల్లును వ్యతిరేకించింది.ప్రైవసీని హరించేలా ఒత్తిడి చేస్తే యూకేలో తన సేవలను నిలిపివేస్తామని పేర్కొంది.ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లు ఆన్‌లైన్‌లో చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయకుండా పిల్లలు, పెద్దలను నిరోధిస్తుంది.
అలాంటి కార్యకలాపాలను తగ్గించడానికి ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లే బాధ్యత వహించేలా నిబంధనలు తీసుకొస్తుంది.

అయితే, బిల్లులోని నిబంధనలు ప్రైవసీని తొలగించడానికి, హ్యాకర్ దాడులకు కొత్త మార్గాలను తెరవడానికి సిద్ధంగా ఉన్నాయని విమర్శకులు వాదించారు.ఇది యూకేలోని ప్రతి ఒక్కరి భద్రతకు ముప్పు కలిగిస్తుంది.బిల్లును అధికార ప్రభుత్వాలు కాపీ చేసి ఆన్‌లైన్ సెన్సార్‌షిప్(Online censorship) కోసం ఒక టెంప్లేట్‌ను రూపొందించవచ్చని వారు భయపడుతున్నారు.
ఇకపోతే వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ టాప్ పొజిషన్‌లో ఉండేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.ఈ ఏడాదిలో ఈ కంపెనీని తీసుకొచ్చిన ఫీచర్లు యూజర్లను బాగా ఆకట్టుకున్నాయి.