నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్..ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే..?

వన్డే ప్రపంచ కప్ లో( ODI World Cup ) భాగంగా నేడు లక్నో వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్( Ind vs Eng ) ఉత్కంఠ భరిత మ్యాచ్ జరగనుంది.భారత్ సొంత గడ్డపై ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది.

 Icc Odi Cricket World Cup 2023 India Vs England Match Today Details, Icc Odi Cri-TeluguStop.com

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈ టోర్నీలో పసికూన జట్ల కంటే ఘోరంగా ఓటమిలను చవిచూస్తోంది.ఇంగ్లాండ్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్ లో గెలిచి ఏకంగా నాలుగు మ్యాచ్లలో ఓడిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ జట్టు సెమీస్ చేరే దారులన్నీ దాదాపుగా మూసుకుపోయాయి.కానీ కనీసం కొన్ని మ్యాచ్లలో గెలిస్తే పరువు దక్కుతుంది.కాబట్టి ఇంగ్లాండ్( England ) ఆడాల్సి ఉన్న మిగతా నాలుగు మ్యాచ్లు కాస్త కీలకం అనే చెప్పాలి.భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు 106 వన్డే మ్యాచ్లు జరగగా.

భారత్ 57, ఇంగ్లాండ్ 44 మ్యాచ్లలో విజయం సాధించాయి.ప్రపంచ కప్ లో మాత్రం ఇంగ్లాండ్ దే ఆధిపత్యం.2003 తర్వాత భారత్( india ) 2007, 2011, 2015, 2019 ప్రపంచ కప్ లలో ఇంగ్లాండ్ చేతిలో వరుసగా ఓటమిని చవిచూసింది.

Telugu Cricket Cup, England, Iccodi, India, India England, Joe Root, Jos Buttler

భారత జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే.కెప్టెన్ రోహిత్ శర్మ తో( Rohit Sharma ) పాటు విరాట్ కోహ్లీ,( Virat Kohli ) కేఎల్ రాహుల్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఆశించిన స్థాయిలో కాకుండా ఒక రకంగా బాగానే రాణిస్తున్నారు.

హార్దిక్ పాండ్యాకు గాయం కావడం వల్ల అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కు( Surya Kumar Yadav ) చోటు లభించింది.సూర్య కుమార్ యాదవ్ తనను తాను నిరూపించుకోవాల్సిన మంచి సమయం ఇదే.భారత జట్టు బౌలింగ్ విషయానికి వస్తే.

Telugu Cricket Cup, England, Iccodi, India, India England, Joe Root, Jos Buttler

బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చాలా చక్కగా రాణిస్తున్నారు.ఇక మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లలో ఎవరో ఒకరికి చోటు దక్కుతుంది.ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే.

బట్లర్,( Buttler ) రూట్,( joe Root ) బెయిర్ స్టో లు ఈ టోర్నీలో పేలవ ఆటను ప్రదర్శిస్తూ ఇంగ్లాండ్ జట్టుకు ఒక పెద్ద మైనస్ గా మారారు.కాబట్టి ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ లైన వోక్స్, విల్లీ, అట్కిన్సన్ లపై ఆధారపడింది.

పిచ్ విషయానికి వస్తే.లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలం.

బౌలింగ్ కు అనుకూలమైన పిచ్ కాబట్టి రెండు జట్లు భారీ స్కోర్లు చేసే అవకాశం లేకపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube