ఏదో సామెత చెప్పినట్టు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ ( TDP )అధినేత ఏ పని చేసినా పాజిటివ్ ఫలితాల కంటే నెగిటివ్ ఫలితాలే ఎక్కువగా వస్తున్నాయి.ఏపీలో కూటమి గెలుపు కోసం చంద్రబాబు ఐదు చోట్ల టీడీపీ అభ్యర్థులను మార్చేశారు.
ఉండి, పాడేరు, వెంకటగిరి, మడకశిర, మాడుగుల స్థానాలలో మార్పులు జరిగాయి.మడకశిర నుంచి సునీల్ కుమార్( Sunil Kumar from Madakasira ) స్థానంలో ఎం.ఎస్ రాజుకు టికెట్ కేటాయించడం జరిగింది.
అయితే మడకశిరలో గెలుపు కోసం ఎంతో కష్టపడిన సునీల్ కుమార్ కు టికెట్ కేటాయించి ఇప్పుడు అభ్యర్థి మార్పు దిశగా చంద్రబాబు అడుగులు వేయడంపై సునీల్ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఫైర్ అయ్యారు.
చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు పార్టీ జెండాలను దహనం చేసి నిరసనకు దిగడం గమనార్హం.సునీల్ కుమార్ కు టీడీపీ తీవ్రస్థాయిలో అన్యాయం చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్.ఎస్.రాజుకు టీడీపీ అధిష్టానం బీఫాం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్న ఫ్లెక్సీని సైతం కార్యకర్తలు( Activists ) చించేశారు.
సొంత పార్టీ కార్యకర్తలే చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారంటే ఆయనకు ఇంతకు మించి అవమానం ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చంద్రబాబు అభ్యర్థులను మార్చడం వల్ల తీవ్రస్థాయిలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల్లో గెలుపు ప్రతి పార్టీకి ముఖ్యమేనని అయితే కొన్ని విలువలను పాటించాల్సి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఎన్నికలకు మూడు వారాల సమయం ఉండగా ఇప్పుడు అభ్యర్థులను మార్చి చంద్రబాబు ఏం సాధిస్తారని టీడీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు చేసిన మార్పులు పార్టీకి మేలు చేస్తాయో లేక కీడు చేస్తాయో చూడాల్సి ఉంది.అభ్యర్థి మార్పు గురించి సునీల్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.