ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోంది.స్టార్ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం, ఐదు భాషల్లో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుండటంతో సినిమాలకు అంచనాలకు మించి బిజినెస్ జరుగుతోంది.
ప్రస్తుతం తెలుగులో అత్యంత భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డ సినిమాలలో కల్కి 2898 ఏడీ మూవీ( Kalki 2898 AD Movie ) కూడా ఒకటి కావడం గమనార్హం.
ఈ సినిమా బడ్జెట్ విషయంలో కానీ, క్యాస్టింగ్ విషయంలో కానీ, ఇతర విషయాలలో కానీ మిగతా సినిమాలను మించి ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 100 కోట్ల రూపాయల రేంజ్ లో విక్రయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఓవర్సీస్ లో 12 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఆ రేంజ్ లో కలెక్షన్లు సొంతమవుతాయని చెప్పవచ్చు.
అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.కల్కి ఓవర్సీస్ రైట్స్ ఎంత మొత్తానికి అమ్ముడవుతాయో తెలియాల్సి ఉంది.కల్కి 2898 ఏడీ బిజినెస్ పరంగా కూడా సరికొత్త రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.ప్రభాస్( Prabhas ) సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.
కల్కి సినిమా ఏపీ హక్కుల కోసం కూడా గట్టి పోటీ నెలకొంది.కమల్ హాసన్, అమితాబ్( Kamal Haasan, Amitabh ) మరి కొందరు ప్రముఖ నటులు నటించడంతో ఈ సినిమాకు బిజినెస్ సైతం అంచనాలకు మించి జరుగుతోందని తెలుస్తోంది.వైజయంతీ మూవీస్ బ్యానర్ మేకర్స్ ఈ సినిమాతో కళ్లు చెదిరే లాభాలు వస్తాయని నమ్మకంతో ఉన్నారు.
ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.