హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా నగదు పట్టుబడింది.ఏఎంఆర్ సంస్థ ఛైర్మన్ మహేశ్ రెడ్డి నుంచి సుమారు రూ.3.50 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారని తెలుస్తోంది.అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారుల సమాచారంతో మహేశ్ రెడ్డి నివాసంతో పాటు ఆయనకు చెందిన సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటక నుంచి అక్రమంగా నగదును తీసుకువచ్చి ఓ పార్టీకి ఇస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఏ పార్టీకి నగదు ఇస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు, ఎలక్షన్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.కోట్లలో నగదు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.