సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు లవర్బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్నారూ.ఇక అలాంటి హీరోలలో సిద్ధార్థ్ కూడా ఒకరు.
బొమ్మరిల్లు నువ్వొస్తానంటే సహా మరికొన్ని సినిమాలు కూడా సిద్ధార్థ్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెగ పెంచేసాయి అని చెప్పాలి.అయితే ఇటీవలి కాలంలో సిద్ధార్థ్ గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు చూస్తే మాత్రం సిద్ధార్థ్ కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా లవర్ బాయ్ అని అర్థమవుతుంది.
ఎందుకంటే ఇప్పటివరకు లవ్ ఎఫైర్ నడిపిన హీరోయిన్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
సిద్ధార్థ్ హీరోగా వచ్చిన మహా సముద్రం సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకా పోయింది అన్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అతిధి రావు హైదరి. ఈ అమ్మడు ప్రస్తుతం సిద్ధార్థ ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే అతిధి రావు హైదరి కి పెళ్లయింది.విడాకులు కూడా జరిగిపోయాయి.
ఇక ఇప్పుడు సిద్ధార్థతో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ఉంది ఈ ముద్దుగుమ్మ.ఎందుకంటే ఇటీవల ఇద్దరూ కలిసి ముంబైలో మీడియా కంట పడ్డారు.
దీంతో మీడియా వాళ్లు ఊరుకుంటారా వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే ఇక నాగచైతన్య కంటే ముందు సమంత సిద్ధార్థ తోనే ప్రేమలో పడింది.జబర్దస్త్ సినిమా సమయంలో మొదలైన వీరి ప్రేమ పైన కొన్ని రోజుల పాటు సాగి ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది.
రంగ్ దే బసంతి సినిమాలో నటించాడు సిద్ధార్థ్ అన్న విషయం అందరికీ తెలుసు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది సోహా అలీ ఖాన్. ఈ అమ్మడిని కూడా ప్రేమలో పడేసాడు లవర్ బాయ్ సిద్ధార్థ్.
విషయం తెలిసి అతని భార్య చివాట్లు పెట్టడంతో కొన్నాళ్ళ పాటు హీరోయిన్ ఇంట్లోనే ఉన్నాడు.కానీ ఆ తర్వాత వీరికి బ్రేకప్ అయింది.

ఓ మై ఫ్రెండ్ సినిమాలో తనతో కలిసి నటించిన శ్రుతిహాసన్ కూడా లైన్ లో పెట్టేసాడు సిద్ధార్థ్.వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు.కానీ ఆ తర్వాత విడిపోయారు.
ఇక దీపా సన్నిధి తో కూడా సిద్ధార్థ్ కొన్నాళ్లపాటు లవ్ ట్రాక్ నడపడం సోషల్ మీడియాలో ఎంతగానో హాట్ టాపిక్ గా మారిపోయింది.
సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను మాత్రం హీరోయిన్ దీపా సన్నిధి ఖండించడం గమనార్హం.ఇప్పుడు కూడా ఖాళీగా లేకుండా అతిధి రావు హైదరి తో ప్రేమ నడిపిస్తున్నాడు సిద్ధార్థ్.