అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) తాజాగా ఏజెంట్ సినిమా(Agent Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే అఖిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గురించి కూడా తెలియజేశారు.నాన్నగారికి ఇండస్ట్రీలో 30 సంవత్సరాల అనుభవం ఉంది.
ఆయనకి అన్ని డిపార్ట్మెంట్లోనూ పట్టు ఉంటుంది.నాకు ఏదైనా సందేహం ఉంటే నాన్నని అడిగి తెలుసుకుంటాను కానీ స్క్రిప్ట్ ఎంపిక చేసుకునే సమయంలో నాన్నని అడిగి ఫైనల్ చేయనని తెలిపారు.

ఇలా నేను స్క్రిప్ట్ విషయంలో నాన్న సలహా తీసుకుంటే ఆయనపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు అవుతుంది.అందుకే ఏజెంట్ సినిమా స్క్రిప్ట్ నాన్నకు అసలు తెలియదని తెలిపారు.ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చూసి ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని అమ్మ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుందని అఖిల్ తెలిపారు.బేసిగ్గా నాకు యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సమయంలోనే సురేందర్ రెడ్డి ( Surender Reddy ) గారు ఈ సినిమా కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పానని అఖిల్ తెలిపారు.

ఈ సినిమా ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక ఈ సినిమా విడుదల సమయంలో తాను ఒకే సెంటిమెంట్ ఫాలో అవుతున్నానని తెలిపారు.ఏప్రిల్ 28వ తేదీ బాహుబలి, అడవి రాముడు, పోకిరి వంటి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి.ఇక ఈ సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి.ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమా కూడా 28వ తేదీ ఏప్రిల్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందన్న సెంటిమెంట్ తనకు ఉందని ఈ సందర్భంగా అఖిల్ వెల్లడించారు.ఇక తనకు పెద్దగా సెంటిమెంట్స్( Sentiments ) లేవని కానీ ఈ సినిమా విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతున్నానని ఈ సందర్భంగా అఖిల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.