కే‌సీ‌ఆర్ రైతుల వైపా? బీ‌జే‌పి వైపా?

దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు రైతులు కలిసి డిసెంబర్ 8 న భారత్ బంద్ కు పిలుపుని ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ విషయంపై ఇప్పటికి కొన్ని రాష్ట్రల్లో రైతులు వాళ్ళకు తోడుగా నాయకులు స్టూడెంట్స్ ధర్నాలు చేస్తున్నారు.

 Hanumantha Rao Comments On Kcr, Kakatiya University Students Supports Former's P-TeluguStop.com

దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టం.తెలంగాణ కాకతీయ యునివర్సిటి విద్యార్థులు సోమవారం నాడు రైతులకు మద్దతుగా నిరసన దీక్షకు దిగారు.తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి వి.హనుమంతరావు కాకతీయ యునివర్సిటి విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుండి హన్మకొండ కు తన కారులో ప్రయాణిస్తుండగా జనగాం లోని పెంబర్తి బైపాస్ దగ్గర పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు.

Telugu Congress, Kakatiya, Hanumantharao-Political

ఈ సందర్భంగా వి.హనుమంతరావు పోలీసు స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్య మంత్రి పై తీవ్ర విమర్శలు చేశాడు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన పోరాడే పార్టీ అని, విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెల్లుతున్న నన్ను ఆపడం అనేది సమంజసం కాదు అన్నారు.తెలంగాణలో భారత్ బంద్ చేసిన తర్వాత కే‌‌సీ‌ఆర్ ను డిల్లీకి రావాలని బి‌జే‌పి అదిష్టానం కోరడంతో డిల్లీ వెళ్ళిన కే‌సీ‌ఆర్ లో మార్పు వచ్చిందని అన్నారు.

అలాగే అక్కడ ఏమి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశాడు.కే‌సి‌ఆర్ రైతుల వైపు ఉంటాడా లేక బి‌జే‌పి పార్టీ వైపు ఉంటాడా అనే విషయం తెలుసుకోవాలని అన్నారు.

వి.హనుమంతరావు అరెస్టు అయిన విషయం తెలుసుకున్న అక్కడి కాంగ్రెస్ నాయకులు వెంటనే పెంబర్తి పోలీసు స్టేషన్ కు వెళ్లారు.

పోలీసులు తమ సొంత పూచీకత్తు పై హనుమంతరావు ని అక్కడి నుండి పంపించేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube