కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం పై చేసిన యుద్ధం ఒకెత్తయితే అమెరికాపై చేసిన యుద్ధం మాత్రం మరొకెత్తు.కరోనా కేవలం అమెరికాను పతనం చేసేందుకే పుట్టిందా, పుట్టబడిందా అనే సందేహాలు ఇప్పటికి అందరికి ప్రశ్నగానే మిగిలిపోయాయి.
ఏది ఏమైనా అమెరికా మాత్రం కరోనా ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అవ్వడమే కాదు ఓ అధ్యక్షుడిని పదవిలోంచి దించేసింది కూడా అంతేనా అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ కూడా కొట్టింది.అయితే
అమెరికా ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఈ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడటానికి తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యి త్వరలో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్న బిడెన్ ప్రణాళికలు రూపొందించారు.
అమెరికా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ లో ప్రస్తుతం ఉన్న సభ్యులకంటే అదనపు సభ్యులను తీసుకున్నారు.అమెరికాకు కొత్త టీమ్ ను పరిచయం చేస్తూ ఆర్ధిక సంక్షోభం నుంచి అమెరికాను బయటపడేయగలిగేలా ఈ టీమ్ కృషి చేస్తుందని అన్నారు.
ఈ టీమ్ లో భారతీయ అమెరికన్ కు కూడా స్థానం కల్పించారు బిడెన్.
ఈ నేషనల్ ఎకానమిక్ కౌన్సిల్ లో అదనపు సభ్యులుగా ఒబామా హయాంలో వైట్ హౌస్ కీలక అధికారిగా ఉన్న డేవిడ్ కామిన్ అలాగే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆర్ధిక కార్యకలాపాలు చూస్తూ బిడెన్ సలహాదారుగా ఉన్న ఇండో అమెరికన్ అయిన భరత్ రామ మూర్తి ఇంకా ఆర్ధిక విధానానికి అధ్యక్షుడికి అసిస్టెంట్ గా జోయెల్ గాంబుల్ ని బిడెన్ నియమించారు.
ఇండో అమెరికన్ అయిన భరత్ రామ మూర్తికి ఆర్ధిక సంస్కరణ అలాగే వినియోగదారుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ఎన్ఈసి కి డిప్యూటి డైరెక్టర్ గా నియమింపబడ్డారు.వీరందరూ అమెరికా ఆర్ధిక స్థితికి పునర్వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తారని బిడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.