అప్పు లిచ్చి నష్టపోయాను...మరీ కమర్షియల్ కాదంటున్న గోపీచంద్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో విలన్ పాత్రలో నటించి అనంతరం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జులై 1వ తేదీ విడుదల కానుంది.

 Gopichand I Loss Money By Giving Debt Im Not That Commercial , Gopichand, Tollyw-TeluguStop.com

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.డబ్బు విషయంలో చాలా మంది ఎంతో కమర్షియల్ గా ఉంటారు.

ఈ సినిమా కూడా ఇలా డబ్బు చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మీరు సినిమాలో చాలా కమర్షియల్ గా ఉంటారా అని యాంకర్ ప్రశ్నించగా ఆయన సమాధానం చెబుతూ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉన్నప్పటికీ, నిజ జీవితంలో తాను కమర్షియల్ కాదని సమాధానం చెప్పారు.

Telugu Gopichand, Maruti, Pucca, Telugu, Tollywood-Movie

నిజజీవితంలో తాను ఎంతో మందికి డబ్బులు ఇచ్చానని అయితే ఇప్పటికీ నాకు కొందరు డబ్బులు ఇవ్వకుండా ఉన్నారని గోపీచందు తెలిపారు.అయితే వారిని ఎప్పుడు తాను డబ్బులు అడగలేదని,నాకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారేమో అని డబ్బు గురించి ఆలోచించడమే మానేశానని, తాను మరి అంత కమర్షియల్ కాదంటూ ఈ సందర్భంగా గోపీచంద్ ఇతరులకు అప్పులిచ్చి నష్టపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube