క్రికెట్ ప్రపంచంలో టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారత క్రికెట్ లో ధోని కెప్టెన్సీ సమయంలో టీమిండియా జట్టును నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఎంఎస్ ధోని ప్రస్తుతానికి మాత్రం కేవలం ఐపీఎల్ లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు.
ఇది ఇలా ఉండగా ఇటీవల ధోని ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు అనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ విషయంపై చెన్నై టీం మేనేజ్మెంట్ స్పందించి మా కెప్టెన్ ధోనీనే అని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.మరో రెండు సంవత్సరాల పాటు సీఎస్కే సారథ్య బాధ్యతలు అన్ని ధోనీనే చూసుకుంటాడని ధోని అభిమానులకు తెలియజేసింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్ననాథన్ ఐఏఎన్ఎస్ తెలియచేశారు.దీంతో ధోనీ ఫ్యాన్స్ సంబరాలకు హద్దులు లేవనే చెప్పాలి.
కొంతమంది ధోని అభిమానులైతే బర్త్ డే ట్రీట్ గా ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆనందంలో మునిగి పోతున్నారు.
ఇది ఇలా ఉండగా యూఏఈలో నిర్వహించబోతున్న ఐపీఎల్ 2021లోను సీఎస్కే టీమ్ ధోనీనే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లను అక్టోబర్ లో తిరిగి ప్రారంభం అవ్వబోతున్నట్లు ఇటీవల బిసిసిఐ ప్రకటించిన సంగతి అందరికీ విధితమే.
ఈ సందర్బంగా మాజీ భారత్ వికెట్ కీపర్ విజయ్ దహియా మాట్లాడుతూ సీఎస్కే అంటేనే ధోనీ, ధోనీ అంటేనే సీఎస్కే అంటూ అన్నారు.ఇప్పటికి ధోని ఇచ్చిన సలహాల మేరకే ఎంతోమంది క్రికెట్ ఆటగాళ్లు ఐపీఎల్లో రాణిస్తున్నట్లు ఇందుకు గల చక్కటి నిదర్శనం సామ్ కరణ్ అని అన్నారు.