చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంది.
అయితే వీక్ డేస్ లో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రాలేదు.ఈ సినిమాను అడ్వాన్స్ లు తీసుకుని నిర్మాతలు రిలీజ్ చేసినా మార్కెట్ లెక్కల ప్రకారం ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు సమాచారం అందుతోంది.
గాడ్ ఫాదర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా ఆ కలెక్షన్లు చిరంజీవి రేంజ్ కు తగిన స్థాయిలో లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గాడ్ ఫాదర్ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ అంశాలు కూడా లేవనే సంగతి తెలిసిందే.
ఈ రీజన్ వల్లే ఈ సినిమాపై సాధారణ ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు.ఇప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులు గాడ్ ఫాదర్ పై ఆసక్తి చూపలేదు .
మరోవైపు దసరా పండుగ కానుకగా మరికొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడం కూడా గాడ్ ఫాదర్ కలెక్షన్లపై ప్రభావం చూపింది.కాంతార సినిమాకు గాడ్ ఫాదర్ సినిమాతో పోల్చి చూస్తే బెటర్ టాక్ రావడంతో గాడ్ ఫాదర్ కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.దీపావళి పండుగ సెలవు పూర్తైన నేపథ్యంలో గాడ్ ఫాదర్ కు ఇకపై నామమాత్రపు కలెక్షన్లు కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదని చెప్పవచ్చు.గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.