విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కేంద్రం శుభవార్త!

కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల చదువులకు కూడా ఆటంకం ఏర్పడింది.ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ల నుంచి సడలింపులు మొదలయ్యాయి.

 Gisp New Portal Launched By Central Government For Students Going Abroad, Foreig-TeluguStop.com

ఈ సందర్భంగా విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.యూనివర్శిటీల్లో ఖాళీలు ఉన్నాయా? ఇన్సూరెన్స్‌ ప్యాకేజీల సౌలభ్యానికి సంబంధించిన ఏ వివరాలు కొంత మంది విద్యార్థులకు తెలియక పోవచ్చు.ఇటువంటి వారికి కేంద్రం ఓ అదిరిపోయే శుభవార్త తెలిపింది.మీరు చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉంటే, దానికి సంబంధించిన సమాచారం కోసం గ్లోబల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ పోర్టల్‌ అనే ప్లాట్‌ఫాం రూపొందించారు.

దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఓ విధంగా ఉపశమనంగా ఉంటుంది.అంతేకాదు, అక్కడి కళాశాలల్లో ఉన్న స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన వివరాలు కూడా ఈ సంస్థ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇందులో విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థుల సమాచారం ఈ పోర్టల్‌లో ఉంటుంది.ఈ పోర్టల్‌ తమ వివరాలు విద్యార్థులు నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ మాడ్యూల్‌ ఉంది.

దీంట్లో ప్రత్యేకంగా విద్యార్థులకు అందించే ఎడ్యుకేషన్‌ లోన్‌లు అందించే బ్యాంకులకు సంబంధించిన వివరాలు, లింకులు కూడా ఉంటాయి.ఇలా విద్యార్థులకు కావాల్సిన అన్ని సేవలను కేవలం ఒక పోర్టల్‌తోనే అందింస్తోంది.

దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని ఎఐపీ హోస్ట్‌గా ఉంది.విదేశాలకు వెళ్లాలనుకున్న దేశాపు ఆర్థిక, సామాజిక, ఆహారపు అలవాట్లను సైతం ఇందులో పొందుపరిచారు.

ఆ మధ్య నకిలీ యూనివర్శిటీల్లో చేరి మోసపోయిన వారు కూడా ఉన్నారు.

Telugu Central, Loans Bank, Foreign, Indian, Indiaforeign, Nri, Scholarship-Late

కాబట్టి ఈ పోర్టల్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు.విద్యా సంస్థలకు చెందిన వివిధ సంస్థల నుంచి సమాచారన్ని సేకరించి ఈ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని 2015లోనే రూపొందించింది.

దీని ద్వారా ఫేక్‌ ఏజెంట్ల వద్ద విద్యార్థులు మోసపోకుండా ఉండటానికి దోహదం చేస్తుంది.విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులను సహకరించటానికే ఈ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా, వారిని ప్రోత్సాహించేలా జీఐఎస్‌పీ సేవలు ఉన్నాయి.కాబట్టి విద్యార్థులకు ఈ పోర్టల్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube