టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ లో మిస్ ఉత్తరఖండ్ గా నిలిచింది.
ఇక ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తన ఫోటోలతో బాగా సందడి చేస్తుంది.
2008లో అందాల రాక్షసి సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల రాక్షసి ఆ తర్వాత వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషలో కూడా నటించింది.ఇక ఈ బ్యూటీ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.అది కూడా తన ఫ్యామిలీ విషయంలోనేనట.

ఈ బ్యూటీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముస్సోరీలో చమసారి అనే ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఉండేలా ఒక కేఫ్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటుందట.ఇక ఈ కేఫ్ ను వ్యాపారం కోసం కాదని తెలిపింది.కేవలం తన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి మాత్రమే ఒక రీఛార్జ్ స్పాట్ లాగా ఉండే విధంగా ప్లాన్ చేస్తుందట.
గతంలో ఆమె చమసారి కొండ పై ఇల్లు కట్టుకోవడానికి అక్కడ భూములను కొన్న లావణ్య మళ్లీ తన మనసును మార్చుకొని కేఫ్ గా ఏర్పాటు చేయాలని అనుకుంటుంది.

అంతేకాకుండా ఎక్కువగా ప్రకృతిని ఇష్టపడే ఈ బ్యూటీ ప్రకృతి సిద్ధమైన కాటేజ్ లాగా రూపొందించడానికి ప్రయత్నం చేస్తుందట.అందుకే గత సంవత్సరం 25 మొక్కలను నాటారని తెలుస్తుంది.ప్రస్తుతం లావణ్య వచ్చిన కేఫ్ ఆలోచన గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక లావణ్య చావు కబురు చల్లగా, ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించగా అంత సక్సెస్ అందుకోలేదు.