Gali Janardhan Reddy : బీజేపీ లో విలీనమైన ‘ గాలి ‘ పార్టీ ! 

కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గతంలో కర్ణాటక బిజెపిలో కీలకంగా ఉండేవారు.ఆ తర్వాత బీజేపీ( BJP ) లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీలో ఇమడలేక, సొంతం గా కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష  ( కే ఆర్ పీ పీ) పేరుతో సొంతంగా పార్టీని స్థాపించారు.

 Gali Party Merged With Bjp-TeluguStop.com

అయితే తాజాగా తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి( Gali Janardhan Reddy ) నిర్ణయం తీసుకున్నారు.గాలి జనార్దన్ రెడ్డితో పాటు, ఆయన భార్య కూడా ఈరోజు బీజేపీ లో చేరారు.

కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బీ వై విజయేంద్ర , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో జనార్దన్ రెడ్డి తన పార్టీ ని బీజేపీ లో విలీనం చేశారు.దీంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ( Lok Sabha elections )ఈ పరిణామాలు తమకు కలిసి వస్తాయని బిజెపి అంచనా వేస్తోంది.

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందింది.దీంతో లోక్ సభ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించింది.

దీనిలో భాగంగానే గాలి జనార్దన్ రెడ్డిని బిజెపిలో చేర్చుకునే విధంగా వ్యూహాలు రచించి అనుకున్న మేరకు సక్సెస్ అయ్యారు.

Telugu Gali Merged Bjp, Devagouda, Galijanardan, Jds, Karnataka Bjp-Politics

బిజెపిలో చేరిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తన పార్టీని బిజెపిలో విలీనం చేశానని, బిజెపిలో చేరానని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) ని మూడోసారి ప్రధాని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పనిచేస్తానని, ఎటువంటి షరతులు లేకుండానే తాను బీజేపీ లో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని గాలి జనార్దన్ రెడ్డి చెబుతున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి తో పాటు భారీగా ఆయన అనుచరులు, అభిమానులు బీజేపీ లో చేరారు.

Telugu Gali Merged Bjp, Devagouda, Galijanardan, Jds, Karnataka Bjp-Politics

కర్ణాటక లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ కు ఎక్కడా అవకాశం దొరక్కుండా చేసేందుకు బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తోంది.దీనిలో భాగంగానే ఇప్పటికే మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కు చెందిన జనతాదళ్ సెక్యులర్ ( జేడీ ఎస్ ) పార్టీతో పొత్తు పెట్టుకుంది.ఇప్పుడు కళ్యాణ కర్ణాటక ప్రాంతం పై మంచి పట్టున్న.

గాలి జనార్దన్ రెడ్డి కి చెందిన పార్టీని విలీనం చేసుకుని ఆయన్ను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ పై పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube