Germany Woman Farming :వ్యవసాయం చేస్తూ మురిసిపోతున్న విదేశీ తెలుగు కోడలు.. ఉల్లిపాయలు నాటుతున్న జర్మనీ వనిత!

ప్రేమకు ఎల్లలు లేవు అనే విషయాన్ని ఇక్కడ ఎన్నో జంటలు నిజం చేసాయి.నేటితరం ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి.

 Foreign Telugu Daughter In Law Who Is Doing Farming-TeluguStop.com

ఈ రోజుల్లో చాలామంది కుర్రకారు విదేశీ అమ్మాయిలను ఇష్టపడుతున్నారు.అదేవిధంగా విదేశీ అబ్బాయిలు కూడా ఇండియన్ అమ్మాయిలను ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలు మనం అనేకం చూసాం.

అలా పెళ్లిళ్లు చేసుకున్నవారు దాదాపుగా విదేశాల్లోనే సెటిలై పోతుంటారు.అయితే అదే ఒక విదేశీ వనిత ఇండియన్ ని పెళ్లి చేసుకొని ఇక్కడ సెటిలై పోయి వ్యవసాయం చేయడం కలలోనైనా ఊహించుకోవడం కష్టం కదా.

కానీ ఇక్కడ అదే జరిగింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంకో విషయం ఏమంటే, ఈ విదేశీ కోడలు హిందీలో కూడా చాలా చక్కగా మాట్లాడుతోంది.వైరలవుతోన్న ఈ వీడియోలో అచ్చం ఇండియన్‌ స్టైల్‌లో దుస్తులు ధరించిన విదేశీ మహిళ నవ్వుతూ పొలంలో ఉల్లిపాయలు నాటడం మనం గమనించవచ్చు.

ఆమె పొలంలో పని చేయడం చూసి, ఆమె భర్త వచ్చి ‘నిన్ను ఒక విషయం అడగవచ్చా?’ అని అడుగుతాడు, దానికి ఆమె ‘అవును’ అని హిందీలో ఆన్సర్‌ ఇవ్వడం మనం చూడవచ్చు.

అప్పుడు భర్త ఒకింత చమత్కారంగా ఆమెను ‘జర్మనీనుండి ఇక్కడికి నువ్వు పొలంలో ఉల్లిపాయలు నాటడానికి వచ్చావా?’ అని అడుగుతాడు.దాంతో ఆమె నవ్వేస్తుంది.అంతేకాకుండా 7 సముద్రాలు దాటి ఇండియాకు నువ్వు వచ్చింది అందుకేనా అంటూ మరోసారి వ్యంగ్యగా అడుగుతాడు.

దీనికి ఆమె సంతోషంగా ‘అవును’ అని రిప్లై ఇస్తుంది.అక్కడికి కాస్త దూరంలో నిలబడి ఉన్న అత్తగారు కూడా చిరునవ్వులు చిందించడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.

కాగా వీడియోలో ఉన్న జర్మనీ మహిళ భర్తతో కలిసి ఓ గ్రామంలో నివాసముంటోంది.ఈ సందర్భంగా ప్రకృతికి, పచ్చదనానికి దగ్గరగా బతుకుతున్నానంటూ హర్షం వ్యక్తం చేసిందీ ఈ జర్మనీ కోడలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube