క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ప్రైజ్ మనీ కింద అర ఎకరం భూమి.. ఏ టోర్నీలో అంటే..!

క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్, దేశవాలీ మ్యాచ్, లీగ్, టోర్నీ లాంటివి ఏవైనా సరే.విజేత జట్టుకు ట్రోఫీతో పాటు క్రికెటర్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ లలో నగదు బహుమతులు ప్రధానం చేస్తారని అందరికీ తెలిసిందే.

 For The First Time In The History Of Cricket, Half An Acre Of Land Under Prize M-TeluguStop.com

క్రికెట్ లో ఇప్పటివరకు అన్ని ఫార్మాట్ల క్రికెట్లలో ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది.అయితే క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక క్రికెటర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కింద నగదును కాకుండా ఓ అర ఎకరం భూమిని బహుమతిగా అందించారు.

ఆ టోర్నీకి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Brampton, Canada, Latest Telugu, Montrealtigers, Sherfaneruther-Sports Ne

కెనడా లోని బ్రాంప్టన్ ( Brampton, Canada )వేదికగా మాంట్రియల్ టైగర్స్ – సర్రే జాగ్వార్స్ జట్ల మధ్య గ్లోబల్ టీ20 కెనడా 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.మొదట బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.131 పరుగుల లక్ష్య చేదనకు దిగిన మాంట్రియల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి ఘనవిజయం సాధించి విజేతగా నిలిచింది.

Telugu Brampton, Canada, Latest Telugu, Montrealtigers, Sherfaneruther-Sports Ne

అయితే మాంట్రియల్ టైగర్స్ ఓటమి అంచుల్లో ఉండగా షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్( Sherfane Ruther Ford ) అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును గెలిపించి విజేతగా నిలబెట్టాడు.ఇతను 29 బంతుల్లో రెండు సిక్సులు, మూడు ఫోర్లతో 38 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కించుకున్నాడు.షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింద 1000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ అందించగా.ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కింద అర ఎకరం భూమిని గిఫ్ట్ గా అందించారు.

ఒక క్రికెటర్ కు టోర్నీలో టోర్నీ లో భూమి ఇవ్వడం అనేది ప్రపంచ క్రికెట్లో ఇదే మొదటిసారి కావడంతో.సోషల్ మీడియా వేదికగా ఈ వార్త తెగ వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube