కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కోవిడ్ టీకా ఒక్కటే ప్రజల ముందున్న మార్గం అని కొందరు చెబుతుండగా, దేశ ప్రజలందరికి ఇంకా వ్యాక్సిన్ అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.అదీగాక దేశవ్యాప్తంగా అందరికి వ్యాక్సిన్ అందాలంటే రెండు సంవత్సారాల వరకు అవుతుందని ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి పరిస్దితుల్లో మన దేశంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలు వందకు వందశాతం వ్యాక్సిన్ తీసుకుని రికార్డు కెక్కారు.ఆ గ్రామం ఎక్కడంటే జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా వేయాన్ గ్రామం.ఇకపోతే సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఈ గ్రామంలోకి వెళ్లాలంటే ఏకంగా 18 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి.ఇంతటి కష్టమైన పరిస్దితుల్లో కూడా ఇక్కడి వైద్య సిబ్బంది చేసిన కృషితో దేశంలోనే తొలిసారి వేయాన్ గ్రామం 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న అరుదైన ఘనత సాధించింది.
ఒక్క ఈ గ్రామమే కాదు దేశం మొత్తం కూడా ఇలాగే టీకా ఇప్పించుకుంటే కోవిడ్‌ను అరికట్టిన వాళ్లం అవుతాం.మరి ఆరోజు ఎప్పుడు వస్తుందో.