ఇటీవల రోజుల్లో చాలా మంది మేకప్ కు బాగా అలవాటు పడ్డారు.అందంగా కనిపించడం కోసం, అందరిని అట్రాక్ట్ చేయడం కోసం మేకప్ ఉత్పత్తులను( Makeup products ) తెగ వాడేస్తున్నారు.
అయితే ఇవి అందాన్ని పెంచినా.చర్మ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
నిత్యం మేకప్ వేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఎన్నో చర్మ సమస్యలు తలెత్తుతాయి.అందుకే సహజంగానే అందంగా మెరవడానికి ప్రయత్నించాలి.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.వారానికి కేవలం రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే న్యాచురల్ గ్లో మీ సొంతం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బంగాళదుంప( potato ), ఒక బీట్ రూట్( Beet root ) ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పెట్టుకొని అందులో బీట్ రూట్-పొటాటో జ్యూస్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ షుగర్( Sugar ) వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించాలి.

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood powder ) మరియు రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి కేవలం రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం సహజంగానే అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
సాగిన చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.
క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి మేకప్ లేకపోయినా సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.