ఆరోగ్యవంతమైన జీవనానికి ఈ వాస్తు టిప్స్‌ తప్పక పాటించండి!

ఆరోగ్యమే మహాభాగ్యమని అందరం నమ్ముతాం. మీ భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా లేకుంటే, అది మీ ప్రొఫెష్‌నల్‌ లైఫ్‌పై ప్రభావం పడుతుంది.

 Follow These Vastu Tips For Good Health And Wealth , Bedroom, House Vastu, Nor-TeluguStop.com

తద్వారా చిన్నపాటి తలనొప్పికి కూడా హాస్పిటల్లకు వెళ్లాల్సివస్తుంది.చాలా మందికి మన ఇంటి పరిసరాలు కూడా వాస్తు దోషాలకు కారణమవుతాయని తెలియవు.

ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.ఒక్కోసారి మన ఇంటికి వేసుకున్న పెయింట్‌ కలర్‌ కూడా వాస్తు అనర్థాలకు దారితీస్తుంది.

అది వ్యక్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.ఈ కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యంతోపాటు ధనయోగం కూడా కలుగుతుంది.

ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఓ క్యాండిల్‌ను వెలిగించాలి.ఒకవేళ అది డోరు లేదా ప్రధాన గేటుకు దగ్గరగా ఉంటే.వాటిని బయటివైపుగా పెట్టాలి.ఏ పని చేసినా తూర్పు లేదా ఉత్తరం దిశగా చేస్తేస్ట్రెస్, యాంగ్సైటీని నుంచి దూరంగా ఉండవచ్చు ఈశాన్యం దిశగా టాయిలేట్లు నిర్మించకూడదు.

ఒకవేళ మీ ఇంటి బాత్‌రూం ఈ దిక్కులో నిర్మిస్తే.మీకు డబ్బు కరువు ఉంటుంది.

ప్రధాన డోరు లేదా ఎంట్రన్స్‌ దగ్గర అద్దాన్ని ఏర్పాటు చేయకూడదు.ఇది దుశ్శకునములకు ఆస్కారమవుతుంది.

Telugu Bedroom, Wealth, Vastu, Northeast, Vastu Dosham, Vastu Sastram-Latest New

సాధారణంగా ఇండోర్‌ ప్లాంట్లను ఇంట్లో శాంతి కోసం ఏర్పాటు చేసుకుంటారు.తులసీ మొక్క పవిత్రతకు మారుపేరు.దీన్ని ఇంట్లో లేదా గార్డెన్‌లో పెట్టుకుంటే మంచి ఆరోగ్యం, యాంగ్సైటీ వంటి రోగాలు రాకుండా ఉంటాయి.బెడ్‌రూంలో లావెండర్‌ మొక్కను పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

ఇది సహజసిద్ధమైన స్ట్రెస్‌ రిలీవర్‌గా పనిచేస్తుంది.

Telugu Bedroom, Wealth, Vastu, Northeast, Vastu Dosham, Vastu Sastram-Latest New

ఇంట్లో రోజ్‌మెరీ, స్పైడర్‌ మొక్కలను పెంచకుంటే హై బీపీ ఉన్నవారితోపాటు ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడే మార్గం కనిపిస్తుంది.మాస్టర్‌ బెడ్‌రూం పైనే ఇంట్లో సుఖసంతోషాలకు కారణమవుతుంది.ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఎల్లపుడు మాస్టర్‌ బెడ్‌రూం నైరూతి దిశలో ఉండాలి.దీనివల్ల ఇంట్లో ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడుతుంది.

ఆగ్నేయం వైపుగా మాస్టర్‌ బెడ్‌రూం పెట్టుకోకూడదు.వాస్తు ప్రకారం ఈ దిశలో బెడ్‌రూం ఏర్పాటు చేసుకుంటే దుష్టశక్తులు ఇంట్లోకి నేరుగా ప్రవేశిస్తాయి.

దక్షిణం వైపుగా తలపెట్టి పడుకోవాలి.దీంతో నిద్ర మంచిగా పడుతుంది.

మంచం ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యం.బెడ్‌లోపల స్టోరేజీ ఉండేటువంటి మంచాలను వాడకూడదు.

అదేవిధంగా అడ్డదిడ్డమైన డిజైన్లలో కాకుండా చెక్కతో చేసినటువంటి తక్కువ పొడవు ఉన్న సింపుల్‌ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలి.ఎప్పుడు కూడా బెడ్‌రూంను బాత్‌రూం గోడకు నిర్మించకూడదు.దీంతో ఇంట్లోకి నెగెటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube